Telangana Weather Alert: తెలంగాణకు వర్ష సూచన.. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో..

Telangana Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన, హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ...

Telangana Weather Alert: తెలంగాణకు వర్ష సూచన.. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో..
Weather Report
Follow us

|

Updated on: Jun 24, 2021 | 2:21 PM

Telangana Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన, హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ రోజు రాష్ట్రంలో గాలులు కింది స్థాయిలో వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి బలమైన గాలులు తీస్తున్నాయన్నారు. ఒక ఝార్ఖండ్ నుంచి ఒడిసా మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉందన్నారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి రాగల మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక ఈ రోజు ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. ఉరుమురు, మెరుపులతో కూడిన వర్షం నేపథ్యంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. బయటకు వెళ్లినప్పుడు వర్షం వస్తే సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలన్నారు. చెట్ల కింద ఉండటం అంత సేఫ్ కాదని పేర్కొన్నారు.

Also read:

Viral Video: వరుడు ఇచ్చిన ‘ఫిల్మీ స్టైల్’ ఎంట్రీకి వధువు ఫ్లాట్.! వీడియో చూస్తే మైండ్ బ్లాంక్..