Formula E: ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ రేస్‌కి భారీ ఏర్పాట్లు.. హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌ పేరుతో 2.8 కి.మీటర్ల ట్రాక్‌

|

Feb 08, 2023 | 8:08 PM

ఫిబ్రవరి 11న మెగా ఈవెంట్‌.. హైదరాబాద్‌ సాగరతీరాన వరల్డ్‌ వైడ్‌ ఈ కార్ రేసింగ్‌కి ఏర్పాట్లు క్లైమాక్స్‌కి చేరాయి. దేశంలోనే మొట్ట మొదటిసారిగా జరిగే ఈ కార్‌ రేసింగ్ ట్రాక్‌ను సర్వాంగ సుందరంగా అంతకుమించి పకడ్బందీగా తీర్చిదిద్దారు.

Formula E: ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ రేస్‌కి భారీ ఏర్పాట్లు.. హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌ పేరుతో 2.8 కి.మీటర్ల ట్రాక్‌
Formula E Hyderabad
Follow us on

మోటార్‌ రేస్‌తో పోల్చితే ఎలక్ట్రానిక్‌ కార్ల రేస్‌ డిఫరెంట్‌. 2014 నుంచి జరుగుతున్న ఈ రేసుల్లో ఉపయోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ కారణంగా ఈ-కార్ రేస్ కొత్తపుంతలు తొక్కుతోంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున.. ఎన్టీఆర్‌ గార్డెన్ చుట్టూ ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్ షిప్ రేస్‌కి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ పేరుతో సిద్దం చేసిన 2.8 కిలోమీటర్ల ట్రాక్‌పై శనివారం సాయంత్రం ఫార్ములా రేస్ జరగబోతుంది.

11 టీమ్ లు.. 22 కార్లు.. ప్రాక్టీస్, క్వాలిఫైయింగ్‌తో కలిపి 4 రేస్‌లు జరుగుతాయి. శుక్రవారం సాయంత్రం 4.25 నుంచి 5.15 గంటల వరకు ప్రీ ప్రాక్టీస్ -1తో రేసింగ్ కార్లు ట్రాక్ పై దూసుకుపోనున్నాయి. శనివారం ఉదయం 8.05 నుంచి 8.55 వరకు ప్రీ ప్రాక్టీస్ -2 జరుగుతుంది. ఆ తర్వాత 10.40 నుంచి 11.55 వరకు గంటకు పైగా క్వాలిఫైయింగ్ రేస్ జరగనుంది. మధ్యాహ్నం 3.05 నుంచి 4.30 వరకు వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేస్ జరగబోతుంది. గంటా 25 నిమిషాల పాటు నాన్ స్టాప్‌గా 22 కార్లు హుస్సేన్ సాగర్ తీరాన మెరుపు వేగంతో దూసుకెళ్తాయి.

3 సెకన్లలో 62 కిలోమీటర్ల వేగం

ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే ఈ కార్లు గరిష్టంగా గంటకు 340 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. 3 సెకన్లలో 62 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కార్ల స్పీడ్‌కి తగ్గట్టు FIA నిబంధనల ప్రకారం ట్రాక్‌ సిద్ధమైంది. కార్గోఫ్లైట్‌లో ఎలక్ర్టిక్‌ కార్ల విడిభాగాలు ఇప్పటికే చేరుకున్నాయి. స్టార్టింగ్ గ్యారేజ్‌లో వాటిని సెట్ చేస్తారు. స్పోర్ట్స్ కార్లు రెడీ అవుతున్న వేళ.. పోటీలను వీక్షించేందుకు జనం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈవెంట్‌కి నగరవాసులు ఎక్కువ సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్న నిర్వాహకులు భారీ సీటింగ్ ఏర్పాటు చేశారు. దాదాపు 22,500 టికెట్లను బుక్‌మైషో, ఎస్‌నెట్‌జెన్‌లో ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. ఫార్ములా ఈ రేస్‌ను హైదరాబాద్‌ ఈ ప్రిక్స్‌ పేరుతో గ్రీన్‌కో నిర్వహిస్తుండగా.. హెచ్‌ఎండీఏ ట్రాక్‌ను సిద్ధం చేసింది. అందరి భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సక్సెస్‌ చేస్తామంటున్నారు నిర్వాహకులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం