పాత బస్తీ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా.. బాధితులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా!

హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఇంకా కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.

పాత బస్తీ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా.. బాధితులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా!
Pm Modi

Updated on: May 18, 2025 | 2:04 PM

హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్ చౌక్ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. అగ్రి ప్రమాదం జరిగిన చోట స్పాట్‌లో ముగ్గురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య భారీగా ఉండటంతో దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ ద్రిగ్భాంతి వ్యక్తం చేస్తూ.. ఘటన గురించి అధికారులను అడిగి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు.

తాజాగా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు ప్రధాని మోదీ. అలాగే, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలు ఈ దుఃఖం నుండి త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం బాధితులకు తక్షణ సహాయం అందిస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో సుమారు 30 మంది ఉండగా, 17 మంది మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి