Hyderabad: రెచ్చిపోయిన కేటుగాళ్లు.. దోషం పెరు చెప్పి దారుణంగా దోచేశారు.. మ్యాటర్ తెలిసి షాకైన పోలీసులు..!

|

Jul 05, 2022 | 11:09 PM

Hyderabad: ఒకరి బలహీనతే మరొకరికి బలం.. ఆ బలహీనతని క్యాష్‌ చేసుకుంటారు ఇంకొందరు. సర్పదోషం ఉందని ఓ వ్యాపారిని నిట్ట నిలువునా ముంచింది

Hyderabad: రెచ్చిపోయిన కేటుగాళ్లు.. దోషం పెరు చెప్పి దారుణంగా దోచేశారు.. మ్యాటర్ తెలిసి షాకైన పోలీసులు..!
Arrest
Follow us on

Hyderabad: ఒకరి బలహీనతే మరొకరికి బలం.. ఆ బలహీనతని క్యాష్‌ చేసుకుంటారు ఇంకొందరు. సర్పదోషం ఉందని ఓ వ్యాపారిని నిట్ట నిలువునా ముంచింది దొంగల ముఠా. నకిలీ బాబా అవతారమెత్తిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు.. ఏకంగా 37లక్షల రూపాయలు దోచేశారు. భువనగిరి టౌన్ పోలీసులు జాయింట్ పరేషన్‌తో ఈ ముఠాను అరెస్ట్ చేశారు. కొండల్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సాహసోపేతంగా ఇన్వెస్టిగేషన్‌ సాగించారు.

రాజస్థాన్‌లోని సీరోహి ప్రాంతం వచ్చిన ఈ దొంగల ముఠా.. కొండల్‌ రెడ్డి అనే ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారిని ముగ్గులోకి దించారు. దొంగ బాబా అవతారమెత్తి వ్యక్తి.. కొండల్‌ రెడ్డికి సర్పదొషం ఉందంటూ బురిడీ కొట్టించాడు. మొదట 44 వేల రూపాయలతో మొదలైన దోపిడీ.. విడతల వారీగా 37లక్షల రూపాయల వరకు లాగేశారు. పూజలు చేయకపోయినా.. మధ్యలో ఆపేసినా ప్రాణాలు పోతాయని భయపెట్టి డబ్బును దండుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్‌ చేశామని.. 8లక్షల రూపాయలు రికవరీ చేశామన్నారు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌.