
తెలంగాణ రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు రేవంత్ సర్కార్ ఎప్పికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించే అంశంపై రవాణా శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా సరికొత్త పాలసీని తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో రాకపోకలు సాగించే ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు రెట్రోఫిట్‌మెంట్ పాలసీని రూపొందించారు. ఈ పాలసీ కింద ప్రస్తుతం,పెట్రోల్, డీజిల్‌తో నడుస్తున్న ఆటోలను ఈవీగా మార్చేందుకు ఎలక్ట్రిక్ కిట్‌లను ఆటో యజమానులకు అందించనున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో దాదాపు 1.26 లక్షల ఆటోలు రాకపోకాలు సాగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వీటన్నింటిని దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని భావిస్తున్నారు. ఇందుకోసం 2026-27 వార్షిక బడ్జెట్‌లో రూ.200 కోట్లు కూడా కేటాయించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక పెట్రోలు, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ కిట్లతో రెట్రోఫిట్ చేసేందుకు ఆటో డ్రైవర్లకు 100 శాతం ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. డ్రైవర్లపై ఆర్థిక భారం పడకుండా సబ్సిడీ ద్వారా ఈ నిధులను అందించాలని ఆదేశించారు.
అయితే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌తో నడుస్తున్న ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లను అమర్చేందుకు రూ.లక్షన్నర నుంచి సుమారు రూ.2లక్షల వరకు ఖర్చు కావొచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ మెుత్తాన్ని సబ్సిడీ ద్వారా డ్రైవర్లకు అందించాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా నగరంలో కాలుష్యం తగ్గడంతో పాటు ఆటో డ్రైవర్ల నిర్వహణ కర్చు కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.