Viral Video: జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తూనే ఉంటాయి. ఇక జంతు రక్షణ కథనాలు ఎప్పుడూ మనసుని ఆకట్టుకుంటూనే ఉంటాయి. డ్రైనేజ్ లో చిక్కుకున్న కుక్కపిల్లలను కార్యకర్తల బృందం 10 గంటల పాటు కష్టపడి రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని అంబేద్కర్ నగర్ లో కుక్కపిల్లలు తల్లి మ్యాన్ హోల్ చుట్టూ.. తిరగడం స్థానికులు చూశారు. అక్కడ మ్యాన్ హోల్ లో చిక్కుకున్న కుక్కపిల్లను చూశారు. ఈ విషయాన్ని వెంటనే స్థానికులు యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీకి తెలిపారు. వెంటనే అప్రమత్తమైన ఎసిడబ్ల్యుఎస్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని వేగంగా చర్యలు చేపట్టింది. మ్యాన్ హోల్ లో చిక్కుకున్న కుక్కపిల్లలు పిల్లల్ని చూసిన బృందం రక్షణ చర్యలు చేపట్టారు. మ్యాన్ హోల్ నుంచి కుక్కపిల్లల్ని బయటకు తీయడానికి డ్రైన్ పై రంధ్రాన్ని పెద్దది చేశారు.. 10గంటలకు పైగా కష్టపడి ACWS బృందం రెస్కూ ఆపరేషన్ నిర్వహించి .. ఐదు కుక్కపిల్లలని సురక్షితంగా మ్యాన్ హోల్ నుంచి బయటకు తీసింది.
ఈ వీడియో ACWS బృందం సోషల్ మీడియా లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.. ముఖ్యంగా తన పిల్లలని రక్షించడానికి బృందం చేస్తున్న ప్రయత్నం సమయంలో తల్లి కుక్క ఆరాటం అందరి హృదయాలను తాకింది. మ్యాన్ హోల్ చుట్టూ.. తల్లి కుక్క తిరుగుతూ.. తనకు సహాయం చేయడానికి వచ్చినవారి ప్రయత్నాలను అర్ధం చేసుకున్న తీరుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా తన పిల్లలను రక్షించిన తర్వాత ఆ కుక్క ఆ బృందం వద్దకు వచ్చి కృతఙ్ఞతలు చెప్పిన తీరు అందరిని ఆకర్షించింది. మ్యాన్ హోల్ నుంచి బయటపడిన వెంటనే ఆ కుక్కపిల్లలు తల్లి వద్దకు ఆత్రంగా చేరుకొని పాలు తగిన సన్నివేశం చూపరుల కంట తడిపెట్టించింది. తల్లిబిడ్డల ప్రేమకు మరో ఉదాహరణగా నిలిచింది ఈ సన్నివేశం అంటున్నారు.
Also Read: బొప్పాయిని అతిగా తింటున్నారా.. అయితే కొంతమందిలో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి