Huzurabad Elections: మరింత హీటెక్కిన హుజూరాబాద్.. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

|

Oct 20, 2021 | 3:01 AM

Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్నా కొద్ది రాష్ట్రంలో రాజకీయంలో మరింత రసవత్తరంగా మారుతోంది. తాజాగా ‘దళిత బంధు’ పథకాన్ని నిలిపివేయాలని

Huzurabad Elections: మరింత హీటెక్కిన హుజూరాబాద్.. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
Bjp
Follow us on

Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్నా కొద్ది రాష్ట్రంలో రాజకీయంలో మరింత రసవత్తరంగా మారుతోంది. తాజాగా ‘దళిత బంధు’ పథకాన్ని నిలిపివేయాలని ఎన్నిక సంఘం ఆదేశించిన నేపథ్యంలో.. హుజూరాబాద్‌లో పొలిటికల్ హీట్ ఇంకాస్త పెరిగింది. దళిత బంధు నిలిచిపోవడాన్ని క్యాష్ చేసుకునే పనిలో అధికార పార్టీ ఉండగా.. ఆ అపవాదు నుంచి బయటపడేందుకు బీజేపీ శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో దళిత బంధు విషయంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘దళిత బంధు’ అంశంలో ప్రజలను రెచ్చగొడుతూ బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారంటూ టీఆర్ఎస్ శ్రేణులై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల పరిశీలకులకు బీజేపీ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ బృందాన్ని బీజేపీ ప్రతినిధులు కోరారు.

అంతేకాదు.. జమ్మికుంట, కమలాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను విధుల నుంచి తప్పించాలని కూడా బీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేసింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నా.. అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోగా.. ఉన్నత అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పలు సాక్ష్యాలు చూపుతూ ఫిర్యాదు చేశారు. మంత్రి హరీష్ రావు డైరెక్షన్‌లో పని చేస్తున్న కమలాపూర్, జమ్మికుంట సర్కిల్ ఇన్స్‌పెక్టర్లను విధుల నుంచి తొలగించాలని కోరారు.

దళిత బంధు ప్రకటించి నెలలు గడిచినా లబ్ధిదారులకు నిధులను సక్రమంగా అందించకుండా.. ప్రభుత్వం దళిత లబ్ధిదారుల నిధులను ఫ్రీజ్ చేసిందని బీజేపీ నేతలు ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ లక్ష్యంగా ఎన్నికలలో లబ్ధి పొందడానికి టీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ దళిత బందు పథకం అందరికీ అందించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తుందని, అలాంటిది బీజేపీ దళిత బంధు వ్యతిరేకి అని ప్రజలను టీఆర్ఎస్ రెచ్చగొట్టే చర్యలు చేపడుతోందన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీ నట్లు వ్యవహరిస్తు్న్నారని, కేవలం బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల విధులు సజావుగా నిర్వహించకుండా, ప్రభుత్వానికి తొత్తులుగా, ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్న వారందరిపై తగిన చర్యలు తీసుకొని, విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల పరిశీలకులను బీజేపీ ప్రతినిధి బృందం కోరింది.

Also read:

Andhra Pradesh: టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడులు.. కన్నెర్ర చేసిన నారా లోకేష్.. సీఎం వైఎస్ జగన్‌పై సంచలన కామెంట్స్..

Badvel Elections: త్వరలోనే సీఎం వైఎస్ జగన్‌కు చెక్ పెడతాం.. బీజేపీ నేత సెన్షేషనల్ కామెంట్స్..

Telangana Crime: ‘ఇంద్ర’ మూవీ సీన్‌ను తలదన్నేలా ఘరనా మోసం.. విషయం తెలిసి షాక్ అయిన పోలీసులు..