Huzurabad By Poll Result Counting Live Updates: తెలంగాణలో ఉత్కంఠగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. ముందుగా అందరూ అనుకున్నట్లుగానే ఫలితాలు వెలువడ్డాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. ఆ తరువాత జరిగిన సాధారణ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు అనూహ్యంగా ఓట్లు పోలయ్యాయి. రౌండ్ రౌండ్‌కి మెజార్టీ పెరిగింది. దాంతో ప్రత్యర్థికి అందనంత దూరంలో విజయ తీరానికి చేరానికి ఈటల రాజేందర్. హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్‌లో తొలి నుంచి చివరి రౌండ్ వరకు.. రెండు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం కనబరిచారు. ప్రతీ రౌండ్‌లోనూ వెయ్యి ఓట్లకు పైగా మెజార్టీలోనే నిలిచారు. ఫలితంగా చివరి రౌండ్ పూర్తయ్యే సరికి ఈటల రాజేందర్ తన ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై 23,865 ఓట్ల ఆధిక్యంలో నిలిచి ఘన విజయం సాధించారు.
కరీంనగర్ SRR డిగ్రీ కాలేజీ దగ్గర ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఇప్పుడు అందరి చూపంతా హుజురాబాద్‌వైపే ఉంది. ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. మళ్లీ కారు దౌడ్ తీస్తుందా? లేక కమలం వికసిస్తుందా? రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ.TRS-BJP మధ్య జరిగే రసవత్తర పోటీలో విజయం ఏ పార్టీని వరించనుంది..? ఒకవేళ ఇక్కడ ఈటల రాజేందర్ నెగ్గితే.. అది బీజేపీ గెలుపు అవుతుందా..? ఈటల రాజేందర్ నెగ్గితే.. అది బీజేపీ ఆధిపత్యానికి సహకరిస్తుందా..? అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ యేడాది జూన్ 4వ తేదీన టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత జూన్ 12 వ తేదీన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో హుజురాబాద్ ఎన్నిక అనివార్యమైంది. జూన్ 14న ఆ వెంటనే బీజేపీలో చేరారు ఈటల రాజేందర్. అప్పటి నుంచి హుజురాబాద్ బైపోల్ ఎన్నిక రాష్ట్రంతోపాటు దేశమంతా హాట్‌టాపిక్‌గా మారిపోయింది. రాష్ట్ర రాజకీయాలకు, వచ్చే ఎన్నికలకు ఈ బైపోల్ ఫలితాలను ముడిపెట్టడంతో అక్కడి ఓటర్లు ఇవ్వబోయే తీర్పుపై పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 723 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరిగింది. పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలైంది. ఇందులో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు 503 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థికి 159 ఓట్లు.. కాంగ్రెస్‌కు 32 ఓట్లు వచ్చాయి. అయితే ఇందులోనూ 14 చెల్లని ఓట్లు పడటం అందరని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. సుమారుగా 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలు భద్రత ఏర్పాట్లలో ఉన్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొదటి అరగంటపాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు.. మొత్తం 753 మంది పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఒక హాళ్లో 7 టేబుల్స్, మరో హాళ్లో 7 టేబుల్స్ చొప్పున ఒక్క రౌండుకు 14 ఈవీఎంల చొప్పున లెక్కిస్తారు. 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు.. వాళ్ల ఏజెంట్ల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సాగుతోంది. కౌంటింగ్ సిబ్బంది, సూపర్ వైజర్లకు శిక్షణ ఇవ్వడం ఇప్పటికే పూర్తయ్యింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది ఫలితం విడుదల కానుంది.
హుజురాబాద్ ఉప పోరుకు అక్టోబర్ 30న పోలింగ్ ముగియగా.. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, పోలింగ్ రోజున హుజురాబాద్ పోటెత్తిందా అన్నట్లుగా ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద క్యూ కట్టారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన 18 ఏళ్ల కుర్రాడి దగ్గర నుంచి.. 90 ఏళ్ల పండు ముసలి వరకు అందరూ.. ఓటింగ్ సెంటర్‌లో కదం తొక్కారు. ఓటర్లలో ఒక్కసారిగా చెతన్యం వచ్చింది. రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగిన 2018 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో 84 శాతం పైగా పోలింగ్ నమోదవగా.. ఈ సారి మాత్రం 86.57 శాతం పోలైంది. అంటే గంతలో కంటే 2.5 శాతం అధికంగా ఓట్లు పోలయ్యాయి. మరి ఓటర్లు ఎవరివైపు ఉన్నారో తెలియాలంటే.. రేపటి వరకు వేచి ఉండాల్సిందే.
హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నేతలకు, శ్రేణులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానంగా మంత్రి హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌లకు ట్విట్టర్ ద్వారా మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు. హుజూరాబాద్‌లో కష్టపడ్డ ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లకు, క్యాడర్‌కు ధన్యవాదాలు అని ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియా వారియర్స్‌కి సైతం అభినందనలు తెలిపారు.
హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల్లో మళ్లీ ఈటల రాజేందరే పైచేయి సాధించారు. 20 రౌండ్‌లోనూ దూసుకుపోయారు. ఈ రౌండ్‌లో ఈటల 1,474 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 20 రౌండ్‌లో ఈటలకు మొత్తం 5,269 ఓట్లు పోలవగా.. మొత్తంగా 96,581 ఓట్లు పోలయ్యాయి. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు 3,795 ఓట్లు పోలవగా.. మొత్తంగా 75,566 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు వెల్లడైన 20 రౌండ్ల ఫలితాల ప్రకారం.. ఈటల రాజేందర్ 21,015 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నికల ఫలితాల్లో ఈటల ప్రభంజనం సృష్టిస్తున్నారు. రౌండ్ రౌండ్ కి ఓట్ల మెజార్టీని పెంచుకుంటూ.. ప్రత్యర్థులకు చిక్కకుండా దూసుకుపోతున్నారు. 19వ రౌండ్‌లో ఈటల రాజేందర్ 3,047 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. ఈ రౌండ్‌లో బీజేపికి 5,910 ఓట్లు పోలవగా.. టీఆర్ఎస్ అభ్యర్థికి 2,869 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 19,535 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఈటల రాజేందర్. కాగా, ఇప్పటి వరకు పూర్తయిన రౌండ్లన్నీ కలిపి బీజేపీకి 91,306 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 71,771 ఓట్లు చొప్పున పోలయ్యాయి.
హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల్లో ఈటల హవా కొనసాగుతోంది. 18వ రౌండ్‌లోనూ బీజేపీకే లీడ్ వచ్చింది. ఈ రౌండ్‌లో బీజేపీ 1,876 ఓట్ల లీడ్‌లో ఉంది. మొత్తంగా చూసుకుంటే.. 16,494 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. 18 రౌండ్‌లో బీజేపీకి 5,611 ఓట్లు పోలవగా.. ఇప్పటి వరకు 85,396 ఓట్లు పోలయ్యాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో తగ్గేదేలే అంటున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. వరుసగా అన్ని రౌండ్లలోనూ ఆధిక్యం కనబరుస్తున్న రాజేందర్.. 17వ రౌండ్‌లోనూ దసుకుపోయారు. ఈ రౌండ్‌లో బీజేపీకి 5,610 ఓట్లు పోలవగా.. 1,423 ఓట్లు లీడ్ సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు 17వ రౌండ్‌లో 4,187 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా చూసుకుంటే.. 17వ రౌండ్ పూర్తయ్యే వరకు బీజేపీకి 79,785 ఓట్లు, టీఆర్ఎస్‌కు 65,167 ఓట్లు చొప్పున పోలవగా.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 14,618 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
16వ రౌండ్ లోనూ బీజేపీదే హహా కొనసాగుతోంది. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై 1,712 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. 16వ రౌండ్‌లో బీజేపీకి 5,689 ఓట్లు పోలవగా.. మొత్తంగా 74,175 ఓట్లు పడ్డాయి. ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3,917 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా 60,920 పోల్ అయ్యాయి. 16వ రౌండ్ ఫలితాల వరకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 13,255 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో రౌండ్ రౌండ్‌కు బీజేపీ దూసుకుపోతోంది. 15వ రౌండ్‌లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ లీడ్ సాధించారు. 15వ రౌండ్‌లో ఈటల 2,149 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హుజూరాబాద్‌లో వెంకట్ బలమురిని బలి పశువును చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్, బట్టి విక్రమార్క తీసుకున్న నిర్ణయం ఇది అని విమర్శించారు. ఒకవేళ హుజూరాబాద్‌లో డిపాజిటివ్ వచ్చి ఉంటే.. రేవంత్ రెడ్డి చరిష్మా వల్లే వచ్చిందని అనేవారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు.. తాము ఎవరూ వెళ్లకపోవడం వల్లే డిపాజిట్ కూడా రాలేదని రేవంత్ అభిమానులు అంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. హుజూరాబాద్ ఫలితాలపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు ఫలితాలను ఆరా తీస్తున్న అమిత్ షా.. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు బాగా శ్రమించారని, వారందరికీ అభినందనలు తెలిపారు అమిత్ షా.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ జోరు కొనసాగుతోంది. ప్రతీ రౌండ్‌లోనూ ఆధిక్యం కనబరిచిన బీజేపీ అభ్యర్థి ఈటల.. 14వ రౌండ్‌లోనూ భారీ లీడ్‌లో నిలిచారు. ఈ రౌండ్‌లో 4,746 ఓట్లు సాధించి 1,046 ఓట్ల లీడ్ సాధించారు. 14 రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ 9,452 ఓట్ల లీడ్‌లో ఉంది.
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ హోరు కొనసాగుతోంది. ఒకటి రెండు రౌండ్లలో వెనుకంజ వేసినా.. మిగిలిన అన్ని రౌండ్లలలోనూ ఈటల హవా కొనసాగుతోంది. తాజాగా వెలువడిన 13వ రౌండ్ ఫలితాల్లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల లీడ్ సాధించారు. 13వ రౌండ్లో 1865 ఓట్ల లీడ్ సాధించింది బీజేపీ. మొత్తంగా చూసుకుంటే.. టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి 8,388 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
12వ రౌండ్‌లోనూ బీజేపీ హహా కొనసాగింది. 1217 ఓట్ల లీడ్ వచ్చింది. 12 రౌండ్ సమయానికి బీజేపీ 6,523 ఓట్ల లీడ్‌లో ఉండగా.. మొత్తం 52,497 ఓట్లు పోలయ్యాయి.
ఏడు రౌండ్ల వరకు లీడ్‌లో కొనసాగిన ఈటల.. తొమ్మిద రౌండ్‌లో మాత్రం కాస్తా వెనుకబడ్డారు. ఈ రౌండ్‌లో అధికార పార్టీ అభ్యర్థి లీడ్‌లోకి వచ్చారు. బీజేపీ అభ్యర్థి 1835 ఆధిక్యంలోకి వచ్చారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో ఇదే అత్యధిక లీడ్ కావడం విశేషం..
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి రౌండ్ నుంచి లీడ్‌లో ఉన్న బీజేపీ ఎనిమిదవ రౌండ్‌లో మాత్రం వెనుకబడింది. ఒక్కసారిగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముందుకు దూసుకొచ్చారు.
ఏడో రౌండ్లలోనూ ఈటల రాజేందర్ ఆధిక్యం దక్కించుకున్నారు. రౌండ్‌రౌండ్‌కు కమలం పార్టీ లీడ్ కనిపించింది. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల 3,432 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 7వ రౌండ్‌లో బీజేపీ 4,038, టీఆర్ఎస్ 3,792, కాంగ్రెస్ 94 ఓట్లు వచ్చాయి. 7వ రౌండ్‌లో ఈటల 252ఓట్ల ఆధిక్యం సాధించారు. ఏడు రౌండ్లు ముగిసేసరికి కమలంకు 31,021, కారుకు 27,589 ఓట్లు నమోదయ్యాయి. ఇక కాంగ్రెస్‌కు 7 రౌండ్లు ముగిసేసరికి 1,086 ఓట్లు వచ్చాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతంది. ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ 3,186 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆరవ రౌండ్‌లో బీజేపీ 4,656, టీఆర్ఎస్ 3,639, కాంగ్రెస్ 180 ఓట్లు వచ్చాయి. 6వ రౌండ్‌లో ఈటల 1,017 ఓట్ల లీడ్ దక్కించుకున్నారు. ఆరు రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి 26,983 ఓట్లు లభించగా.. టీఆర్ఎస్‌కు 23,797 ఓట్లు నమోదయ్యాయి. కాంగ్రెస్‌కు ఆరు రౌండ్లు ముగిసేసరికి 992 ఓట్లు వచ్చాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. తొలి రౌండ్ నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. రౌండ్ రౌండ్‌కు లీడ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. మొత్తంగా ఐదు రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ 22,327.. టీఆర్ఎస్ 20,158.. కాంగ్రెస్ 680 ఓట్లు సాధించాయి.
BJP: 4358 – 22327
TRS: 4014 – 20158
Congress: 132 – 812
కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తల హల్‌చల్ కొనసాగుతోంది. ఆధిక్యం పెరుగుతుండడంతో ఈటల క్యాంప్ కార్యాలయానికి క్యూకడుతున్నారు జనం. హుజురాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కార్యకర్తలు కరీంనగర్‌కు చేరుకున్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేక పోవడంతో కరీంనగర్‌లోకి ఎంటర్ కాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో కరీంనగర్ శివారులోని మానకొండూరు KSR గార్డెన్ వరకే అనుమతించారు. గార్డెన్‌కు వచ్చిన ఈటల కార్యకర్తలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.
రౌండ్‌రౌండ్‌కు బీజేపీకి ఆధిక్యం పెరుగుతోంది. ఐదో రౌండ్‌లోనూ ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. అన్ని రౌండ్లలో కలిపి 2169 లీడ్ వచ్చింది. బీజేపీకి 344 ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు .
హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హుజురాబాద్ లోకల్ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఫలితాల సరళిని పరిశీస్తున్న సందర్భంగా ఇంటికి వచ్చిన వారితో కొద్ది సేపు మాట్లాడారు. ఫలితాలపై వారితో మాట్లాడారు.
హుజురాబాద్ బైపోల్ కౌంటింగ్‌లో బీజేపీ ఆధిక్యంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు. చివరి వరకు ఇదే లీడ్ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసేవారినే ప్రజలు ఆదరిస్తారని అన్నారు.
ముందు నుంచి ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. నాలుగవ రౌండ్‌లోనూ తన లీడ్‌ను కనసాగిస్తున్నారు.
ప్రధాన పార్టీలకు ఇండిపెండెంట్ గుర్తులు చుక్కలు చూపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సాధించిన ఓట్లు 114 కంటే ఎక్కువగా ఇండిపెండెంట్ రోటీ మేకర్ గుర్తుకు 122 ఓట్లు పోలయ్యాయి. మొదటి ఐదు రౌండ్లలో హుజూరాబాద్ మండల ఓట్లను లెక్కిస్తారు.
మూడో రౌండ్ ముగిసే సమయానకి బీజేపీకి ఆధిక్యంలోనే ఉంది. మొదటి నుంచి లీడ్‌లో ఉన్న ఈటల రాజేందర్.. ఈ రౌండ్‌లోనూ తన ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. ఈ రౌండ్‌లోనూ ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్‌లో ఈటలకు 911 ఓట్లు ఆధిక్యం రాగా.. మొత్తంగా ఆయనకు 1,269 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
రెండో రౌండ్‌లో 193 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ లీడ్ ఉంది. రెండు రౌండ్లు కలిపి బీజేపీ 359 ఓట్లు ఆధిక్యం వచ్చింది. రెండో రౌండ్‌లో బీజేపీ 4659, టీఆర్ఎస్ 4851, కాంగ్రెస్ 220 ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. హుజురాబాద్ టౌన్‌లోని సగం ఓట్లు రెండో రౌండ్‌లో లెక్కించారు. సిర్సపల్లి, సింగాపూర్, తమ్మనపల్లి, మందపల్లి, బోయినపల్లిలోని ఓట్లను లెక్కించారు. మూడో రౌండ్‌లో హుజురాబాద్ మిగిలిన భాగం లెక్కిస్తారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు పోలిన గుర్తులు మోకాలడ్డుతున్నాయి. కారును పోలిన గుర్తుగా ఉండటంతో రోటీ మేకర్ ఉండటంతో పోటీ చేసిన అభ్యర్థికి 122 ఓట్లు వచ్చాయి. ఇక కమలం గుర్తును పోలిన వజ్రం గుర్తుకు 113 ఓట్లు వచ్చాయి.
తొలి రౌండ్ ఫలితం వచ్చేసింది. హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట్ పోలింగ్ స్టేషన్‌లో తొలి రౌండ్ ముగిసింది. ఇదులో కమలం అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీజేపీకి 4610, టీఆర్ఎస్‌కు 4444 ఓట్లు, కాంగ్రెస్ 119 ఓట్లు వచ్చాయి.
తొలిఫలితం హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట్ పోలింగ్ స్టేషన్‌తో మొదలవు తుంది . తుది ఫలితం కమలాపూర్ మండలం శంభునిపల్లితో ముగియనుంది . మధ్యలో వీణవంక , జమ్మికుంట , ఇల్లందకుంట మండలాల ఫలితాలు వస్తాయి .
హుజురాబాద్ ఓట్ల లెక్కింపు కేంద్రం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీని కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ పరిశీలించారు. లెక్కిపులో పాల్గొంటున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 723 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరిగింది. పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలైంది. ఇందులో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు 503 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థికి 159 ఓట్లు.. కాంగ్రెస్‌కు 32 ఓట్లు వచ్చాయి. అయితే ఇందులోనూ 14 చెల్లని ఓట్లు పడటం అందరని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితంపై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇటు తెలంగాణ.. అటు ఏపీలోనూ బెట్టింగ్ రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటూ జోరు పెంచారు. అయితే
పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్‌కు ఆధిక్యం రావడంతో బెట్టింగ్ రాయుళ్లలో ఉత్కంఠ మొదలైంది. ఉప ఎన్నిక ఫలితాలపై కొన్ని ముఠాలు కోట్లాది రూపాయల మేర బెట్టింగ్‌లు కాస్తున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో ఉత్కంఠగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈవీఎంల లెక్కింపు మొదలైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరిగింది. ఇందులో ఫలితం తారుమారైంది. ఇందులో ఆధిక్యం అధికర పార్టీకి దక్కింది. కరీంనగర్ SRR డిగ్రీ కాలేజీ దగ్గర రెండు పార్టీల కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. EVMల లెక్కింపు కోసం రెండు హాల్స్‌లో, 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. రౌండ్‌కు 14 EVMల్లో ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లు ఉన్నాయి.
పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం వచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కరీంనగర్ SRR డిగ్రీ కాలేజీలో కొనసాగుతోంది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. EVMల లెక్కింపు కోసం రెండు హాల్స్‌లో, 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. రౌండ్‌కు 14 EVMల్లో ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లు ఉన్నాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైపోయింది. హుజూరాబాద్‌లో తెరుచుకున్న ఈవీఎంలు. హుజూరాబాద్ టౌన్ నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. తొలుత హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత ఇల్లంతకుంట, కమలాపూర్‌లో ఓట్ల లెక్కింపు 10 రౌండ్ల తర్వాత ఫలితంపై క్లారిటీ వస్తుంది. వీణవంక, ఇల్లంతకుంటలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కమలాపూర్, జమ్మికుంట, హుజూరాబాద్‌లో హోరాహోరీ ఉండే ఛాన్స్ ఉంది.
తెలంగాణలో ఉత్కంఠగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైపోయింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది. కరీంనగర్ SRR డిగ్రీ కాలేజీ దగ్గర ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. EVMల లెక్కింపు కోసం రెండు హాల్స్‌లో, 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. రౌండ్‌కు 14 EVMల్లో ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లు ఉన్నాయి.
మొత్తం కౌటింగ్ 22 రౌండ్లలో పూర్తవుతుంది. అయితే ఫైనల్ రిజెల్ట్ మాత్రం మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశం ఉంది. దీని కోసం కౌంటింగ్ కేంద్ర దగ్గర మూడెంచల భద్రతను కల్పించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు చోట్ల ట్రాఫిక్‌ను కూడా దారి మళ్లించారు.
మొత్తం 753 మందికి పోస్టల్ బ్యాలెట్స్ పంపిణీ చేశారు. వీటి కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. ఇందు కోసం 14 టేబుల్స్‌ను రెడీ చేశారు. ప్రతి రౌండ్‌కు 14 ఈవీఎంల చొప్పున లెక్కింపు మొదలవుతుంది.
హుజురాబాద్ కౌంటింగ్‌కు మరికాసేపట్లో మొదలు కానుంది. ముందుగా.. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలు కానుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మొదటి అరగంట పాటు..పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది.
హుజురాబాద్‌లో భారీ పోలింగ్ నమోదు పొలిటికల్ పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఓటరు నాడిని అంచనా వేయడం కష్టంగా మారింది. ఐతే హుజురాబాద్, వీణవంక, ఇల్లంతకుంటలో భారీగా పోలింగ్ నమోదైంది. ఈ మండలాల్లో టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి.
మొత్తం 5 మండలాలైన హుజురాబాద్ ,ఇల్లంతకుంట, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్‌లో గ్రామీణ, మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ సారి ఓటింగ్ కూడా భారీగా నమోదైంది. 2018 ఎన్నికల్లో 84.42 శాతం పోలింగ్ నమోదుకాగా…2021లో 86.33 శాతం నమోదైంది. అంటే 2018 ఎన్నికల్లో కన్నా ఇది 1.91 శాతం ఎక్కువ.
2018లో కన్నా 2021లో 27 వేల ఓటర్లు పెరిగారు. మొత్తం 2,36,873 ఓటర్లు ఉండగా.. వారిలో 2,05,236 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 5 మండలాలైన హుజురాబాద్ ,ఇల్లంతకుంట, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్‌లో గ్రామీణ, మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
2018 ఎన్నికల్లో హుజురాబాద్‌లో 84.42 శాతం పోలింగ్ నమోదైంది. అప్పట్లో టీఆర్‌ఎస్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేశారు. లక్షా 4 వేల 840 ఓట్లు అంటే 59.34 శాతం ఓట్లు పోలయ్యాయి. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డిపై 43,719 ఓట్ల మెజార్టీతో ఈటల గెలుపొందారు.
ఈ యేడాది జూన్ 4వ తేదీన టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత జూన్ 12 వ తేదీన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో హుజురాబాద్ ఎన్నిక అనివార్యమైంది. జూన్ 14న ఆ వెంటనే బీజేపీలో చేరారు ఈటల రాజేందర్. అప్పటి నుంచి హుజురాబాద్ బైపోల్ ఎన్నిక రాష్ట్రంతోపాటు దేశమంతా హాట్‌టాపిక్‌గా మారిపోయింది. రాష్ట్ర రాజకీయాలకు, వచ్చే ఎన్నికలకు ఈ బైపోల్ ఫలితాలను ముడిపెట్టడంతో అక్కడి ఓటర్లు ఇవ్వబోయే తీర్పుపై పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.