
యాదాద్రి జిల్లా గుండాల మండలం బుర్జుబావికి చెందిన మహిళతో పదేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేశ్యగిరి గ్రామానికి చెందిన ఏనుగుల బాలనర్సయ్యకు వివాహమైంది. బాల నరసయ్య జీవనోపాధికి హైదరాబాద్ వెళ్లి భార్యతో కలిసి జవర్ నగర్ ఉంటూ టైల్స్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బుర్జు బావికి చెందిన గడ్డం దావీద్ జులాయిగా తిరిగేవాడు. వరుసకు సోదరి అయిన బాల నర్సయ్య భార్యతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న వివాహేతర బంధం తెలిసిన బాల నరసయ్య భార్యను తీవ్రంగా మందలించాడు. బంధువులు కూడా చెప్పారు.. అయినా ఆమె నడవడికలో మార్పు రాలేదు. దావీదుతో కలిసి ఆమె కొద్ది రోజులు వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. భర్త, కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పి బుర్జుబావికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో బాలనర్సయ్య కూడా తన అత్తగారి ఊరైన బూర్జుబావిలోనే ఉంటూ కూలి పనులకు వెళ్తున్నాడు.
దావీదు మాత్రం స్వగ్రామానికి రాకుండా ఉంటున్నాడు. అయితే ఓటు వేసేందుకు దావీదు గ్రామానికి వచ్చాడని బాల నరసయ్య తెలుసుకున్నాడు. దావీదును తీసుకొని బాల నరసయ్య తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అక్కడ ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఉన్న బాలనర్సయ్య దావీదుపై దాడి చేసి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. దీంతో కింద పడిపోయిన దావీదును కర్రలతో బాల నరసయ్య, మహిళా సోదరుడు వంశీలు విచక్షణారహితంగా కొట్టడంతో దావీదు మృతిచెందాడు.
మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు గుండాల ఎస్సై తేజంరెడ్డి తెలిపారు. దావీదు హత్యకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..