ఓరి దుర్మార్గుడా.. బ్యాట్‌తో భార్యను కొట్టి చంపిన భర్త! ఎందుకంటే..

Husband killed wife in Sangareddy district: భార్యపై అనుమానంతో ఓ భర్త అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా కట్టుకున్న భార్యనే హత్య చేసి చేతులు దులుపుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..​

ఓరి దుర్మార్గుడా.. బ్యాట్‌తో భార్యను కొట్టి చంపిన భర్త! ఎందుకంటే..
Husband Beats Wife To Death In Sangareddy District

Edited By: Srilakshmi C

Updated on: Nov 09, 2025 | 7:23 PM

అమీన్‌పూర్, నవంబర్‌ 9: భార్యపై అనుమానంతో ఓ భర్త అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా కట్టుకున్న భార్యనే హత్య చేసి చేతులు దులుపుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..​

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎస్ఆర్ కాలనీలో కృష్ణవేణి, బ్రహ్మయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే ఈ మధ్య గత కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కోహిర్ డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కృష్ణవేణిపై భర్త బ్రహ్మయ్య అనుమానం పెంచుకున్నాడు. ఈ అనుమానమే చివరకు దారుణానికి దారితీసింది.

​ఆదివారం ఉదయం ఇదే విషయమై భార్యాభర్తల మధ్య మరోమారు తీవ్ర వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో బ్రహ్మయ్య బ్యాట్‌తో కృష్ణవేణిపై దాడి చేసి, అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్‌ చేసి, జైలుకు తరలించారు. ​ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అమిన్ పూర్ సీఐ నరేష్ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.