Variety toddy: చిలక కొట్టిన పండంటే వెనకముందు చూడకుండా తినేస్తారు పండ్ల ప్రియులు. ఎందుకంటే అది యమ టెస్ట్ గా ఉంటుందనేది అందరికి తెలిసిందే. అలాంటి చిలక కొట్టిన పండును ఎవరికి ఇచ్చిన వద్దనకుండా తినేస్తుంటారు. అయితే తాజాగా చిలక తాగిన తాటి కల్లు ప్రచారం లోకి వచ్చాయి. అంతేకాదు అది యమా టెస్ట్ గా ఉండడంతో ముందుగానే ఫోన్ చేసి మరి బుక్ చేసుకుంటున్నారు కల్లు ప్రియులు. తాటి వనంలో రామ చిలుకలు తాగిన కల్లు కోసం ఎగబడుతున్నారు కల్లు ప్రియులు. ఈ క్రేజీ కల్లు వనం పెద్దపల్లి జిల్లా(Peddapalli district) సుల్తానాబాద్(Sultanabad) మండలం నీరుకుళ్ల గ్రామంలో ఉంది. రామ చిలుకలు ఎంగిలి చేసిన కల్లు మధురంగా ఉంటుందని చెబుతున్నారు కళ్లు ప్రియులు. తాటిచెట్టు నుండి వచ్చే కల్లును రామచిలుకలు మొదటగా సేవిస్తాయని.. అందుకే చిలకమ్మ ఎంగిలి తాటి కల్లు ఎంతో మధురంగా.. చాలా తియ్యగా ఉంటుందని గొప్పగా చెప్పారు కల్లు ప్రియులు. ఈ సీజన్లో రామచిలుకలు తాటికల్లును ఎక్కువగా సేవిస్తాయని.. అందుకే ఈ సీజన్లో రామచిలుకలు ఎంగిలి చేసిన కల్లు తాగేందుకు రెండ్రోజుల ముందుగానే ఫోన్ చేసి మరీ బుక్ చేసుకుంటున్నారని చెప్పారు కల్లు దుకాణదారులు.
రామ చిలుకలు ఎంగిలి కల్లును తాగేందుకు ఒక్క పెద్దపల్లి జిల్లా వాసులే కాకుండా.. పొరుగు జిల్లాల నుండి కూడ కల్లు ప్రియులు పెద్ద సంఖ్యలో వచ్చి సేవిస్తున్నారని చెబుతున్నారు కల్లు దుకాణాదారులు. డిమాండ్‌ను బట్టి రేటు కూడా కాస్త ఎక్కువే. అంతేకాదు ఈ కల్లు ఏడాదిలో రెండు నెలల పాటే దొరుకుతుందట. ఇంకేందుకు ఆలస్యం.. కల్లు ప్రియులూ.. అటువైపు ఓ లుక్కేయండి.
Also Read: దానికీ ప్రాణముందిగా.. టిక్కెట్ కొట్టాల్సిందేనన్న కండక్టర్.. ఆ తరువాత ఏం జరిగిందంటే..!