నిజామాబాద్‌లో వింత ఆచారం

| Edited By:

Mar 22, 2019 | 12:16 PM

నిజామాబాద్‌లో పిడిగుద్దుల పోరాటం భయంకరంగా సాగింది. వందలమంది రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు రక్తం కారేలా కొట్టుకున్నారు. ముక్కూ ముఖం ఏకమై రక్తాలు కారుతున్నా ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. ఆట 10 నిమిసాలే సాగినా అందరిలో తీవ్ర టెన్షన్ నింపింది. ఎలాంటి ఘర్షణ జరుగుతుందోనన్న ఆందోళన పోలీసుల్లోనూ కనిపించింది. ప్రతీ ఏటా హోలీ రోజున బోధన్ మండలం హంస్స గ్రామంలోని ఈ విచిత్ర ఆచారం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు 126 ఏళ్లుగా ఈ ఆచారం వస్తోందని గ్రామస్థులు […]

నిజామాబాద్‌లో వింత ఆచారం
Follow us on

నిజామాబాద్‌లో పిడిగుద్దుల పోరాటం భయంకరంగా సాగింది. వందలమంది రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు రక్తం కారేలా కొట్టుకున్నారు. ముక్కూ ముఖం ఏకమై రక్తాలు కారుతున్నా ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. ఆట 10 నిమిసాలే సాగినా అందరిలో తీవ్ర టెన్షన్ నింపింది. ఎలాంటి ఘర్షణ జరుగుతుందోనన్న ఆందోళన పోలీసుల్లోనూ కనిపించింది.

ప్రతీ ఏటా హోలీ రోజున బోధన్ మండలం హంస్స గ్రామంలోని ఈ విచిత్ర ఆచారం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు 126 ఏళ్లుగా ఈ ఆచారం వస్తోందని గ్రామస్థులు అంటున్నారు. ఆలయం కూడలిలోని ఆరడుగుల స్తంభాలకు ఓ బలమైన తాడును కడతారు. అనంతరం గ్రామ పెద్దలు డప్పు వాయిద్యాలతో ఈ వేడుక ప్రారంభమవుతుంది. ఆట ముగిసిన అనంతరం ఒకరునొకరు ఆలింగనం చేసుకుంటారు.

కులమతాలకతీతంగా ఆత్మీసమ్మేళనం పేరుతో ఈ ఆటను ఆడతారు గ్రామస్తులు. కామదహనం మరుసటిరోజు ఈ ఆటను ప్రారంభిస్తారు. ఉదయం రంగోలి, మధ్యాహ్నం కుస్తీ పోటీలు.. సాయంత్రం ఈ వితం ఆచారాన్ని నిర్వహిస్తారు. ముందు పోలీసులు ఈ ఆటకు పర్మీషన్ ఇవ్వకపోయినా గ్రామస్తుల హామీతో ఆటకు అనుమతించారు.