Nirmal Kids: హోలీ(Holi) వస్తుంటే చాలు సందడే సందడి. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే రంగుల పండుగ(Colours Festival). హొలీ పండగ వస్తుంటే చిన్న పిల్లలు వారం రోజుల ముందు నుంచి కొలలు వేస్తారు. చిన్న పిల్లలు కోలాటంతో ఇంటికి వెళ్లి.. డబ్బులు అడిగి.. అలా వచ్చిన డబ్బులతో రంగులను కొనుకొని హొలీ పండగను సరదాగా జరుపుకుంటారు. అయితే తాము కొలలతో అడుగుతుంటే.. కొంతమంది చిల్లర లేదని అంటున్నారని.. ఆ చిన్న పిల్లలలు తమ తెలివికి పదును పెట్టారు. అప్ డేట్ గా అలోచించి.. పేటీఎం చేయమని అడుగుతున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా లో చోటు చేసుకుంది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పిల్లలు హొలీ పండుగ వచ్చిందంటే పిల్లల సరదాగా కొలలు వేస్తారు. వారం రోజుల పాటు దుకాణలలో కొలలతో చిల్లర అడుగుతుంటారు. అయితే కొలలు వేస్తూ దుకాణం యజమానులు డబ్బులు అడుగుతుంటే చిల్లర కైన్స్ లేదని దుకాణందారులు చెబుతున్నారు. దీంతో పిల్లలు వినూత్నంగా ఆలోచించారు. రూపాయి లేదా రెండు రూపాలు ఇస్తారని ఆలోచనతో పేటియం తో కొలలు ఆడుతున్నారు ఫోన్ పే, గూగుల్ పే తో ఐదు, లేదా పది రూపాలు వేస్తారనే ఆలోచనతో తిరుగుతున్నారు.
హొలీ పండుగకు తొమ్మిది రోజుల ముందు నుండి కొలలు వేస్తూ దుకాణంలో, ఇండ్లలో కొలలు వేస్తూ చివరి రోజు కోలాలను కమదహనం చేసి మరుసటి రోజు ఉదయం వారం నుండి అడిగిన డబ్బులతో రంగులు కొనుక్కొని మిత్రులతో హొలీ సంబరాలు ఆడుకుంటారు.
Also Read: Telangana: రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న ఎండలు.. హాఫ్ డే స్కూల్స్‌ను ప్రకటించిన విద్యాశాఖ
Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. ఆదివారం కిలో వెండిపై ఎంత పెరిగిందంటే..