Pranahita-Godavari Basin : ప్రాణహిత-గోదావరి బేసిన్‌‌కు సరికొత్త చరిత్ర.. 240 మిలియన్ ఏళ్ల నాటి జీవజాతిని గుర్తించిన ఐఎస్‌ఐ..

|

Jun 15, 2021 | 3:07 PM

Pranahita-Godavari Basin : కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఎస్‌ఐ) పరిశోధకులు తెలంగాణ రాష్ట్రంలోని

Pranahita-Godavari Basin : ప్రాణహిత-గోదావరి బేసిన్‌‌కు సరికొత్త చరిత్ర.. 240 మిలియన్ ఏళ్ల నాటి జీవజాతిని గుర్తించిన ఐఎస్‌ఐ..
Old Species
Follow us on

Pranahita-Godavari Basin : కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఎస్‌ఐ) పరిశోధకులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రాణహిత-గోదావరి బేసిన్‌‌కి సంబంధించి సరికొత్త విషయాలను కనుగొన్నారు. చరిత్ర పూర్వయుగం నుంచి ఇక్కడ అరుదైన జంతుజాలానికి ఆవాసం ఉండేదని తెలుసుకున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో అనేక ప్రాచీన శిలాజాలు వెలుగు చూసాయి. కోటసారస్‌ యెమెన్పల్లెన్సిస్‌, రింకోసారస్‌ జాతికి చెందిన డైనోసర్‌, స్టెగోడాన్‌‌ల ఏళ్ల కిందట అంతరించిన ఏనుగుజాతికి చెందిన శిలాజాలు వెలుగులోకి వచ్చాయి.

అదే ప్రాంతంలో లక్షల ఏండ్ల క్రితం నివసించిన అరుదైన సరీసృపజాతులను కూడా ఐఎస్‌ఐ పరిశోధకులు గుర్తించారు. 20వ శతాబ్దం మధ్యలో గుర్తించిన అనేక శిలాజాలను ఐఎస్‌ఐ భద్రపరిచింది. వాటిలో యెరపల్లి రాతి నమూనా శిలాజాలపై పేలియాంటాలజిస్టులు పరిశోధన చేస్తున్నారు. ఆ శిలాజం 240 మిలియన్‌ సంవత్సరాల క్రితంనాటిదని కనుగొన్నారు. అంతరించిపోయిన మాంసాహార సరీసృప జాతి ఎరిథ్రోసుచిడేకు చెందినదని గుర్తించారు. ఈ శిలాజానికి ‘భారీ తలాసుచస్‌ తపన్‌గా’ పేరు పెట్టారు. భారీ అంటే పెద్దదైన తల, సుచస్‌ అనేది మొసలి తల కలిగిన ఈజిప్టు దేవత పేరని వెల్లడించారు. అయితే ఇప్పుడు మళ్లీ గోదావరి బేసిన్ లో మరిన్ని పరిశోధనలు జరగాలనే చర్చ జరుగుతుంది.

ఈ మధ్యనే మరో అరుదైన జీవి గుర్తించారు. అది లక్షా 36వేల ఏళ్ల కిందటే అంతరించిన పక్షి జాతికి చెందినది. హిందూ మహాసముద్రంలోని ఓ పగడపు దీవిలో ఇటీవల కనిపించిన రెయిల్ జాతికి చెందిన పక్షి అది. గొంతు భాగంలో తెల్లని రంగు దాని ప్రత్యేకత. పొడవాటి ముక్కుతో వేటాడుతుంది. పెద్దగా ఎగరలేదు సముద్ర తీర ప్రాంతాల్లో మనుగడ సాధిస్తుంది. ఈ పక్షి ఇటీవల హిందూ మహాసముద్ర తీరంలో సైంటిస్టుల కంటపడింది. అల్ దబ్రా అనే పగడపు దీవిలో కెమెరాకు చిక్కింది. యూకేలోని పోర్ట్స్ మౌత్ యూనివర్సిటీ, నేచురల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకులు దీనిని గుర్తించారు. రెయిల్స్ జాతి పక్షుల్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. హిందూ మహాసముద్ర దీవులైన మడగాస్కర్, మారిషస్, ఈస్ట్ కోస్ట్ ఆఫ్రికా ప్రాంతాల్లో మరిన్నిఅరుదైన జాతులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

Mobile Toilets : రాజధానికి వివిధ పనుల మీద వచ్చేవారికి, గ్రేటర్ హైదరాబాద్ వాసులకు పెద్ద శుభవార్త.!

Koratala Shiva: కొరటాల శివ బర్త్ డే.. అరుదైన ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..

Modi Cabinet Expansion Buzz: త్వరలో కేంద్ర కేబినెట్‌లోకి పవన్ కళ్యాణ్..! వేగంగా మారుతున్న ఢిల్లీ రాజకీయాలు..!