Telangana: పిల్లల కోసం ఆస్పత్రులను పెంచండి.. కోవిడ్, ఒమిక్రాన్ పరిస్థితులపై హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court: దేశంలో కరోనా విజృంభిస్తోంది. 8 రోజుల్లోనే కేసుల సంఖ్య ఒక్కసారిగా లక్ష మార్క్ దాటింది. కోవిడ్‌తోపాటు కొత్త వేరియంట్

Telangana: పిల్లల కోసం ఆస్పత్రులను పెంచండి.. కోవిడ్, ఒమిక్రాన్ పరిస్థితులపై హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana High Court

Updated on: Jan 07, 2022 | 1:58 PM

Telangana High Court: దేశంలో కరోనా విజృంభిస్తోంది. 8 రోజుల్లోనే కేసుల సంఖ్య ఒక్కసారిగా లక్ష మార్క్ దాటింది. కోవిడ్‌తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా పంజా విసురుతోంది. అయితే.. తెలంగాణలోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్‌, కొత్త వేరి ఒమిక్రాన్ పరిస్థితులపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఒమిక్రాన్ వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నందున నిర్ధారణ పరీక్షలు పెంచాలని ప్రభుత్వానికి ఆదించింది. ఒమిక్రాన్ వైరస్ చిన్న పిల్లలలో కూడా చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. కావున ఇప్పుడున్న నీలోఫర్ ఆసుపత్రి కాకుండా అదనంగా కొన్ని ఆసుపత్రులను పెంచాలంటూ ప్రభుత్వానికి సూచించింది.

21-12-2021, 28-1-2021 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్‌, ఇతర కమర్షియల్ ఎస్టాబ్లిస్‌మెంట్ కోసం కరోనా నియమనిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. వారాంతం జరిగే సంతలలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

కాగా.. తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న రాష్ట్రంలో 1,913 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,87,456కి చేరింది. తాజాగా నమోదైన కోవిడ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1214 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

Omicron: దేశంలో భారీగా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. 3 వేలు దాటిన కేసుల సంఖ్య

ICMR : ఒమిక్రాన్‌తో భయం లేదు.. లక్షణాలు లేకుంటే ఇంట్లోనే చికిత్స.. ఐసీఎంఆర్ నిపుణుల కీలక వ్యాఖ్యలు..