Gupta Nidhulu: ఓ రైతు తన పొలాన్ని దున్నుతుండగా గుప్త నిధులు ఉన్న కుండ లభింది. అది చూసి ఆ రైతు మురిసిపోయాడు. తన పంట పడిందనుకున్నాడు. కానీ ఆ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి అధికారుల చెవిన పడింది. దాంతో అధికారులు వచ్చి ఆ గుప్త నిధులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో చోటు చేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్‌లో ఓ రైతు తన పొలం దున్నుతున్నాడు. అంతలో నాగలికి ఏదో బలంగా తట్టింది. తవ్వి చూడగా.. కుండ లభ్యమైంది. దానిలో విలువైన బంగారం నాణెలు, ఇతరాలు ఉన్నట్లు గమనించాడు. అయితే ఆ రైతుకు గుప్త నిధులు దొరికిన విషయాన్ని ఊరంతా తెలిసిపోయింది. అలా ఆ విషయం అధికారుల చెవిన పడింది. పురవాస్తు శాఖ అధికారులు, పోలీసులు సదరు రైతు వద్దకు వచ్చి భూమిలో దొరికిన కుండను స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన వివరాల కోసం రైతును విచారిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also read:
బైడెన్, కమలా హారిస్ పదవీ ప్రమాణం రోజున రంగవల్లులతో స్వాగతం, అప్పుడే సన్నాహాలు, అమెరికాలో ‘భారతీయత’