తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన మేడారం జాతర (Medaram Jatara)కు వెళ్లే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆదివారం (ఫిబ్రవరి13) నుంచి మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవల(Helicopter services) ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. జాతర పూర్తయ్యేవరకు ఈ సేవలు కొనసాగుతాయని పేర్కొంది. ఈమేరకు హనుమకొండ నుంచి హెలికాప్టర్ లో భక్తులను మేడారం చేర్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ఈ హెలికాప్టర్లను నడపనుంది .
కాగా హనుమకొండ నుంచి మేడారం వెళ్లి రావడానికి ఒకరికి రూ.19,999 ఛార్జీ నిర్ణయించారు. అలాగే 8 నుంచి 10 నిమిషాల జాతర విహంగ వీక్షణం కోసం రూ.37వేలుగా ధర ఫిక్స్ చేశారు. టికెట్లు బుక్ చేసుకోవడానికి హెలిటాక్సీ వెబ్‌సైట్ లేదా 9400399999, 9880505905 నంబర్లను సంప్రదించవచ్చు. కాగా మేడారం భక్తుల కోసం హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీలో హెలిప్యాడ్ కూడా సిద్ధం చేశారు అధికారులు. ఒక్కో ట్రిప్పులో ఆరుగురు ప్రయాణించేందుకు అవకాశం ఉంది.
Also Read:
V. Hanumantha Rao: కర్నూలులో దీక్షకు దిగిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.. కారణమేంటంటే..
IPL 2022 Auction: కోహ్లీ టీంలోకి ధోని స్నేహితుడు.. తగ్గేదేలే అంటూ కాసులు కురిపించిన ఆర్సీబీ..