Hyderabad Rains: హైదరాబాద్‌లో సోమవారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ముంచెత్తింది. అయితే రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయని.. నగరంలో మూడు రోజుల పాటు.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమయింది. రాష్ట్రంలో మరో మూడు రోజులు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అయితే హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం. దీంతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు అప్రమత్తమయ్యాయి. విద్యుత్ తీగలు తెగినట్లు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ దృష్టికి తీసుకురమ్మనమని అధికారులు నగర ప్రజలకు సూచించారు.
నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. ఏపీ, తెలంగాణలో నైరుతి మబ్బులు కమ్మేశాయి. గడువు కంటే ముందే మాన్‌సూన్ దేశంలోకి ఎంట్రీ ఇచ్చినా, విస్తరించేందుకు మాత్రం టైమ్ తీసుకున్నాయ్. మే 15 నాటికే మాన్‌సూన్ అండమాన్‌ను తాకింది. కానీ, మందగమనంతో అక్కడే ఆగిపోయాయి. IMD లెక్క ప్రకారం జూన్ ఫస్ట్ వీక్‌లోనే ఏపీ, తెలంగాణలోకి నైరుతి వర్ష మేఘాలు ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా, వారం పది రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..