Gulab Cyclone Effect: తెలుగు రాష్ట్రాల్లో గులాబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. పలుచోట్ల వరద ముంపు భయాలు

గులాబ్‌ తుపాను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల జనం గుండెల్లో దడ పుట్టిస్తోంది. తుఫాన్‌ తీరం దాటి బలహీనపడుతున్నా.. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుండడంతో వరద ముంపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.

Gulab Cyclone Effect: తెలుగు రాష్ట్రాల్లో గులాబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. పలుచోట్ల వరద ముంపు భయాలు
Heavy Rains

Updated on: Sep 27, 2021 | 11:50 AM

Gulab Cyclone Effect: గులాబ్‌ తుఫాను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల జనం గుండెల్లో దడ పుట్టిస్తోంది. తుఫాను తీరం దాటి బలహీనపడుతున్నా.. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుండడంతో వరద ముంపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లాలు అతి భారీ వర్షాలకు అతలాకులతం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.   తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన గులాబ్ ‌తుఫాను.. రాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటింది. తీరం దాటిన తర్వాత బలహీనపడి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం అయింది. మరో 6 గంటల్లో మరింత బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. అటు శ్రీకాకులం, విజయనగరం జిల్లాలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గం.లు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు.. మరికొన్ని చోట్ల కుంభవృష్టి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గులాబ్‌ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

ఇటు తెలంగాణలో నల్గొండ, ఖమ్మం హైదరాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో సైతం భారీ వర్షాలు పడుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కొనసాగితే వరద ముంపు మరింత ఉండే అవకాశముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Also Read..

JNTUH Exams: హైదరాబాద్‌ జెఎన్‌టీయూ పరిధిలో పరీక్షలు వాయిదా.. భారీ వర్షాలే కారణం. రేపటి పరీక్షలు మాత్రం..

Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రజలకు కీలక సూచన చేసిన విద్యుత్ శాఖ