నగరంలో భారీ వర్షం.. పలుచోట్ల పవర్ కట్..

| Edited By:

May 16, 2020 | 3:45 PM

గత రెండు మూడు రోజులుగా భానుడి భగభగకు అట్టుడికిపోయిన భాగ్యనగర వాసులకు ఉపశమనం లభించింది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. బలమైన గాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, శేర్ లింగంపల్లి, కార్వాన్‌ ప్రాంతాలతో పాటుగా.. నగర శివారుల్లో కూడా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక పలుచోట్ల భారీ వృక్షాలు […]

నగరంలో భారీ వర్షం.. పలుచోట్ల పవర్ కట్..
Follow us on

గత రెండు మూడు రోజులుగా భానుడి భగభగకు అట్టుడికిపోయిన భాగ్యనగర వాసులకు ఉపశమనం లభించింది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. బలమైన గాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, శేర్ లింగంపల్లి, కార్వాన్‌ ప్రాంతాలతో పాటుగా.. నగర శివారుల్లో కూడా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగడంతో.. వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.