Heavy Rain: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రంతా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతలన్నీ జలమయ్యాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడడం ఈ వర్షాలకు ఊతమిచ్చింది. అలాగే వచ్చే వారంలో ఉత్తరాంధ్రకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. మరో రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్‌సాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇందులో భాగంగానే మూడు రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈదురు గాలులతో కూడిన కుండపోత వాన పడింది. వీధులన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతలన్నీ నీటితో నిండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక కడప జిల్లా పులివెందులలో కుంభవృష్టి కారణంగా.. పులివెందుల-కదిరి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మోట్నూతలపల్లెలో వరద ఉధృతికి మూగజీవాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. విజయవాడలోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఇక తెలంగాణ విషయానికొస్తే.. గురువారం ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి (కె)లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, హైదరాబాద్‌లో గత రాత్రి ఏడున్నర గంటల నుంచి పదిన్నర గంటల వరకు మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వానకు జనజీవనం స్తంభించి పోయింది. మూడు గంటల్లోనే ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇదిలా ఉంటే శనివారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి బలహీనపడడంతో శుక్రవారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉండగా.. మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్రంలోని 18 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వీటిలో మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలు ఉన్నాయి.
Also Read: Butchaiah chowdary: కార్పొరేట్ తరహా సరికాదు.. బాబుతో వన్ టు వన్ టాక్.. తేల్చిసిన సీనియర్ నేత