సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు భారీ జరిమానా.. ఎందుకంటే.?

|

Dec 21, 2019 | 5:04 PM

సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు మున్సిపల్ అధికారులు షాకిచ్చారు. హరితహారంలో భాగంగా నాటిన 4 చెట్లను నరికేయడంతో భారీగా జరిమానా విధించారు. సిద్దిపేట స్థానిక కొత్త బస్టాండ్ దగ్గరలో శివమ్స్ గార్డెన్ దగ్గర హరితరహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగిపోవడంతో అక్కడ ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోర్డింగ్ కనిపించడం లేదని మాల్ నిర్వాహకులు వాటిని నరికివేశారు. ఇది కాస్తా మున్సిపల్ హరితహారం అధికారుల దృష్టికి రాగా.. వారు సదరు షాపింగ్ మాల్ నిర్వాహకులకు రూ.45 […]

సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు భారీ జరిమానా.. ఎందుకంటే.?
Follow us on

సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు మున్సిపల్ అధికారులు షాకిచ్చారు. హరితహారంలో భాగంగా నాటిన 4 చెట్లను నరికేయడంతో భారీగా జరిమానా విధించారు. సిద్దిపేట స్థానిక కొత్త బస్టాండ్ దగ్గరలో శివమ్స్ గార్డెన్ దగ్గర హరితరహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగిపోవడంతో అక్కడ ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోర్డింగ్ కనిపించడం లేదని మాల్ నిర్వాహకులు వాటిని నరికివేశారు.

ఇది కాస్తా మున్సిపల్ హరితహారం అధికారుల దృష్టికి రాగా.. వారు సదరు షాపింగ్ మాల్ నిర్వాహకులకు రూ.45 వేల భారీ జరిమానాను విధించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను నరికినా లేదా ధ్వంసం చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.