Telangana: ఇదేం తాగుడు.. తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ల విక్రయాలు.. గత ఏడాది కంటే..

తెలంగాణలో గత నెల రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి తొలి వారం నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చగా.. మందుబాబులు నీళ్లు తాగినట్లు బీర్లను లాగించేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బీర్ సేల్స్ భారీగా పెరిగిపోయాయి. గత ఏడాది మార్చి కంటే ఈ ఏడాది మార్చిలో విక్రయాలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి.

Telangana: ఇదేం తాగుడు.. తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ల విక్రయాలు.. గత ఏడాది కంటే..
Beer

Updated on: Apr 27, 2026 | 4:09 PM

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకుమించి నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లను సేవిస్తున్నారు మందుబాబులు. దీంతో ఎండల వల్ల బీర్ల విక్రయాలు రికార్డ్ సృష్టిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి సమ్మర్‌లో బీర్ల సేల్స్ భారీగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. దీంతో బీర్ల విక్రయాలు మరింత పెరుగుతాయని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. దీంతో బీర్ల కొరత రాకుండా ఉత్పత్తిని పెంచుతున్నాయి కంపెనీలు. బీర్ల సరఫరాలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గత ఏడాది కంటే పెరిగిన సేల్స్

ఈ ఏడాది మార్చిలో బీర్ల విక్రయాలు ఏకంగా 50.78 లక్షల కేసులకు చేరుకున్నాయి. గత ఏడాది మార్చిలో 39.05 లక్షల కేసులు అమ్ముడవ్వగా.. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 30 శాతం వృద్ది చెందాయి. బీర్ల ధరలు పెరిగినప్పటికీ.. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం మందుబాబులు చిల్డ్ బీర్లను తాగేస్తున్నారు. దీంతో బీర్ సేల్స్ భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖకు కూడా ఆదాయం గణనీయంగా పెరుగతోంది. ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు చాలామంది బీర్లను తాగేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే సేల్స్ ఒక్కసారిగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అటు ఐఎంఎఫ్ఎల్ మద్యం విక్రయాలు 2.5 శాతం తగ్గాయి. ఇక మార్చిలో మొత్తం విక్రయాలు రూ.3,845 కోట్లకు చేరుకున్నాయి.

రికార్డ్ స్థాయిలో విక్రయాలు

మార్చి 31న ఒక్కరోజే రూ.410.87 కోట్ల విక్రయాలు జరిగాయి. అయితే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ సేల్స్ మాత్రం స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది మార్చిలో 31.46 లక్షల కేసులు అమ్ముడుపోగా.. ఈ సారి 30.67 లక్షల కేసులకు చేరుకున్నాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే 2.5 శాతం తగ్గుదల నమోదైందని చెప్పవచ్చు. ఇక ఈ ఏడాది మార్చిలో రూ.3,485 కోట్ల ఆదాయం మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రాగా.. గత ఏడాది రూ.3126 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఏకంగా 11.49 శాతం వృద్ది నమోదైందని చెప్పవచ్చు. భానుడు ఉగ్రరూపం దాల్చుతున్న క్రమంలో ఐఎంఎఫ్‌ఎల్ లిక్కర్ కంటే బీర్లకే ఎక్కువమంది ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక జూన్ వరకు ఎండ ప్రభావం ఉండే అవకశముంది. దీంతో బీర్ల విక్రయాలు మరింతగా పెరుగుతాయిన ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఏప్రిల్‌లో కూడా భారీగా సేల్స్ జరగ్గా.. గణాంకాలు ఇంకా బయటకు రాలేదు.

Follow Us