తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతం.. తొలి రోజు 3,530 మందికి టీకా అందించామన్న హెల్త్‌ డైరెక్టర్

|

Jan 16, 2021 | 7:19 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతమైందని హెల్త్‌ డైరెక్టర్‌ డా.శ్రీనివాస్ వెల్లడించారు. టీకా తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్‌ సురక్షితమేనని రుజువు చేశారని పేర్కొన్నారు. గాంధీలో క్రిష్ణమ్మ, నార్సింగ్‌లో జయమ్మ..

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతం.. తొలి రోజు 3,530 మందికి టీకా అందించామన్న హెల్త్‌ డైరెక్టర్
Follow us on

Vaccination Success : తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతమైందని హెల్త్‌ డైరెక్టర్‌ డా.శ్రీనివాస్ వెల్లడించారు. టీకా తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్‌ సురక్షితమేనని రుజువు చేశారని పేర్కొన్నారు. గాంధీలో క్రిష్ణమ్మ, నార్సింగ్‌లో జయమ్మ తొలి టీకా వేసుకున్నారని అన్నారు. వాక్సిన్ వేసుకున్న వాళ్లంతా రోల్ మోడల్స్ అని చెప్పుకొచ్చారు. వాక్సిన్ పూర్తి సేఫ్ అని తేలిపోయిందన్నారు. 20 మందికి టీకా వేసుకున్న చోట ఎర్రబడిందని, ఇది సమస్య కాదని చెప్పారు. వాక్సిన్ వేసుకున్నవారి ఆరోగ్యాన్ని ట్రాక్‌ చేస్తామని తెలిపారు.

తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 140 కేంద్రాల్లో 3,530 మందికి టీకా అందించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియ కోసం రెండు నెలలుగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఎంతో శ్రమించారని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, కొవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరా చేసిన కేంద్ర ప్రభుత్వానికి డా.శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా​ వ్యాక్సినేషన్​ జరుగుతోంది. లఖ్​నవూలోని బలరాంపుర్​ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సమక్షంలో టీకాలను వేశారు. ఈ ఆసుపత్రిలో ఇవాళ 102 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్​ వేయనున్నట్లు ఆయన తెలిపారు.

టీకా తీసుకున్న 42 రోజుల తర్వాతే యాంటీబాడీస్‌ వృద్ధి చెందుతాయని వివరించారు. మొదటి డోస్‌ తీసుకున్న కేంద్రంలోనే రెండో డోస్‌ తీసుకోవాలని.. వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో త్వరలోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మున్ముందు ప్రతి కేంద్రంలో వంద మందికి టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 104కు ఫోన్‌ చేసి వ్యాక్సిన్‌పై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి :

Central Minister: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇద్దరు సీఎంలకు లేఖలు రాసిన కేంద్రమంత్రి..