Central Minister: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇద్దరు సీఎంలకు లేఖలు రాసిన కేంద్రమంత్రి..

Central Minister: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రాజెక్టు అంశంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది.

Central Minister: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇద్దరు సీఎంలకు లేఖలు రాసిన కేంద్రమంత్రి..
Follow us

|

Updated on: Jan 16, 2021 | 5:15 PM

Central Minister: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రాజెక్టు అంశంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. కృష్ణా, గోదావరి నదులపై ఇరు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శనివారం నాడు కేంద్ర జలశఖ్తి మంత్రి గజేంద్ర షెకావత్ ఇరు రాష్ట్రాల ముఖ్యమత్రులు జగన్, కేసీఆర్‌కు లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 19 ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లను సమర్పించాలని కేంద్ర మంత్రి కోరారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా 15 ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని కోరారు. అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో అన్ని ప్రాజెక్టుల డీపీఆర్లను పంపిస్తామని రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించిన విషయాన్ని కేంద్ర మంత్రి తన లేఖలో గుర్తుచేశారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, సెంట్రల్ వాటర్ కమిషన్లలో డీపీఆర్లను సమర్పించి, ఆపై అపెక్స్ కౌన్సిల్ లో ఆమోదం పొందేవరకు ఏ ప్రాజెక్టు నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లొద్దని మంత్రి స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ అప్పగింత, నిర్మాణం, అమలు వంటి పనులేవీ చేయవద్దని తేల్చి చెప్పారు.

సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖలోని జలవనరుల విభాగం సలహా మండలి నుంచి టెక్నో ఎకనమిక్ అనుమతులు పొందినవి మినహా, కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ లేదా విభజన చట్టంలో ప్రస్తావన లేని ఏ ప్రాజెక్టయినా సరే కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాల్సి ఉంటుందని కేంద్రమంతి తన లేఖలో స్పష్టం చేశారు. అలాంటి ప్రాజెక్టులు విభజనకు ముందు చేపట్టినా, తర్వాత చేపట్టినా సరే కొత్త ప్రాజెక్టులుగానే పరిగణిస్తామని తెలిపారు. ఈ క్రమంలో పాత ప్రాజెక్టుల్లో మార్పులు జరిపినా సరే కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ కారణంగా ప్రాజెక్టుల డీపీఆర్లను వెంటనే సమర్పించాలని పునరుద్ఘాటించారు. డీపీఆర్‌లను సమర్పించిన తరువాత సాధ్యమైనంత త్వరగా వాటిని మదింపు చేస్తామని మంత్రి షెకావత్ ఇరు రాష్ట్రాల సీఎంలకు హామీ ఇచ్చారు.

ఇదిలాఉండగా, విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో చేపట్టే ఏ ప్రాజెక్టు విషయంలోనైనా డీపీఆర్‌లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల ద్వారా అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. విభజన చట్టంలో లేకపోయినా సరే, అంతర్రాష్ట్ర నదులపై నిర్మించే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి హైడ్రాలజీ, ఇంటర్-స్టేట్, ఇన్వెస్ట్‌మెంట్, పర్యావరణ తదితర అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై 8 ప్రాజెక్టులు కడుతుండగా, కృష్ణా నదిపై 7 ప్రాజెక్టులను కడుతోంది. ఇక ఏపీ ప్రభుత్వం కూడా కృష్ణా నదిపై 15 ప్రాజెక్టులను కడుతుండగా, గోదావరి నదిపై 4 ప్రాజెక్టులను కడుతోంది.

డీపీఆర్‌లు సమర్పించాల్సిన ప్రాజెక్టులు… కృష్ణా బేసిన్ 01. ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 02. గుండ్రేవుల రిజర్వాయర్ 03. గాజులదిన్నె ఆయకట్టుకు సహకరించే లిఫ్ట్ ఇరిగేషన్ పథకం 04. గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 05. పులికనుమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 06. సిద్దాపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 07. శివభాష్యం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 08. మున్నేరు స్కీం 09. రాజోలిబండ డైవర్షన్ స్కీం సామర్థ్యం పెంపు 10. ఆర్డీఎస్ – సుంకేసుల మధ్య తుంగభద్రపై కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 11. ప్రకాశం బ్యారేజ్ ఎగువన వైంకుంఠపురం బ్యారేజ్ సామర్థ్యం పెంపు 12. హరిశ్చంద్రవరం గ్రామం నుంచి గుంటూరు జిల్లా నెకరికల్లు గ్రామం వరకు గోదావరి – పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్ట్ ఫేజ్-1 13. వేదవతి (హగరి) నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 14. నాగులదిన్నె లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 15. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 80వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంపు

గోదావరి బేసిన్ 1. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 2. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 3. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 4. చింతలపూడి లిఫ్ట్ – పట్టిసీమ లిఫ్ట్ ద్వారా గోదావరి – పెన్నా నదుల అనుసంధానం ఫేజ్-1