జన్వాడలోని ఓ విల్లాలో జరిగిన పార్టీ తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది.. పార్టీలో భారీగా విదేశీ మద్యాన్ని పట్టుబటడం.. డ్రగ్స్ వినియోగించినట్లు ఒకరికి పాజిటివ్ తేలడంతో పోలీసులు విచారణను వేగవంతంచేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాంహౌస్ ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర ఉందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు.. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలి కానీ..పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనపై కూడా విచారణ జరుపుతున్నారని.. మూసీ కుట్రలను బయటపెట్టినందుకే కేటీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారంటూ పేర్కొన్నారు. అసలు పార్టీ జరిగింది ఫామ్‌హౌస్ కాదు.. రాజ్ పాకాల కొత్తగా కట్టిన ఇల్లు అని హరీష్ రావు పేర్కొన్నారు. డ్రగ్స్ పార్టీ, రేవ్ పార్టీ అని మాట్లాడుతున్నారని.. లీకులు ఇస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ పేర్కొన్నారు. రేవ్ పార్టీలో పిల్లలు, వృద్దులు ఉంటారా? అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కొనలేకనే.. కేటీఆర్ పై బురద జల్లుతున్నారని తెలిపారు. ఫాంహౌస్ ఫంక్షన్ లో కేటీఆర్ సతీమణి లేరన్నారు.
కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు గమనిస్తున్నారన్నారని.. సీఎం రేవంత్ రెడ్డికి విజన్ లేదంటూ హరీష్ రావు పేర్కొన్నారు. రేవంత్ సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలు రోడ్డెక్కుతున్నారన్నారు. బండి సంజయ్ తనస్థాయికి తగ్గించుకుని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలకు BRS భయపడదన్నారు.
హత్యా రాజకీయాలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీనే రోడ్డు మీదకొచ్చారని, పోలీసుల మీదనే నిర్భందాలు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డిది అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. పోలీసులే రోడ్డు మీదకు రావటం చరిత్రలో మెదటసారని.. వివరించారు. రుణమాఫీపై ప్రశ్నించినందుకు రేవంత్ రెడ్డి తనను బాడీ షేమింగ్ చేశారని.. సీఎం వికృతమైన వైఖరిని చూస్తు ప్రజలు విస్తుపోతున్నారన్నారు.
ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు కాదు.. 20వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ కు వచ్చే దమ్ము రేవంత్ కు ఉందా? అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. 15వేలు సంగతి అటుంచితే.. ఉన్న పది వేల రైతుబంధు కూడా లేకుండా చేసిన ఘనత రేవంత్ ది అంటూ ఎద్దెవా చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..