Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటి పూట బడులకు డేట్ ఫిక్స్..

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగి.. ఉక్కుపోత అల్లాడిస్తుంది. ముఖ్యంగా స్కూళ్లలో పిల్లలు ఇబ్బంది పడతున్నారు. దీంతో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు రెడీ అవ్వాలి. డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటి పూట బడులకు డేట్ ఫిక్స్..
Telangana Schools

Updated on: Mar 03, 2024 | 10:10 AM

ఒంటిపూట బడులను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమైంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగింది.  ఉక్కపోత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు క్లాసులు జరుగుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు క్లాసుల ముగిసిన అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తారు.  ఎండలు, వేడి గాలుల నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో మంచి నీరు వెంటనే అందేలా చూడాలని ప్రభుత్వం సూచించింది. అలానే ఫ్యాన్లు నిర్వహణ కూడా సరిగ్గా ఉండాలని ఆదేశించింది. అన్ని స్కూల్స్ ఈ రూల్స్ పాటించాలి. లేదంటే కఠిన చర్యలు ఉంటాయి.  ఏప్రిల్ 24..  ఈ ఏడాది పాఠశాలలకు చివరి పని దినం. అందువల్ల ఏప్రిల్ 25 నుంచి విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. కాగా ఒంటిపూట బడులు అనంతరం పిల్లలు ఇళ్లకు వెళ్లి.. ఎండలో గేమ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తారు. వారికి తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు చెప్పి ఇంట్లోనే ఉండేలా చూడాలి. లేదంటే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది.

కాగా తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో SSC పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే వారికి భోజనం తర్వాత స్పెషల్ క్లాసులు నిర్వహించనున్నారు. అటు టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహిస్తారు.

విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ గుడ్‌న్యూస్

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ సెంటర్లకు నిమిషం ఆలస్యంగా వచ్చినా.. ఇప్పటివరకు స్టూడెంట్స్‌ను అనుమతించేవారు కాదు. ఈ నిర్ణయం కారణంగా పరీక్ష రాయలేకపోయిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అధికారులతో సమాలోచనలు చేసిన ప్రభుత్వం… 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా  ఎగ్జామ్ రాసేందుకు అనుమతించాలని నిర్ణయించింది. లేటుగా వచ్చిన స్టూడెంట్స్‌కు 5 నిమిషాలు గ్రేస్ టైం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…