తెలంగాణలో ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ కలకలం రేపుతున్నాయి. గుజరాత్‌లోని ఉగ్రవాద అనుమానితుడితో రామగుండం అమ్మాయి చాట్ చేయడం ఇప్పుడు కలకలం కలిగిస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా జరిగిన పరిచయంతో ఇది సాదాసీదాగా సాగిన సంభాషణా.. లేదంటే మరేదైనా కోణం ఉందా అని తేల్చేపనిలో ఉంది ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్). ప్రస్తుతం అనుమానాలగానే చెప్పిన గుజరాత్ ఏటీఎస్ అధికారులు.. సదరు బాలికను హైదరాబాద్ తరలించారు. ఆమె ఫోన్, సంభాషణలు పరిశీలించిన తర్వాత ఓ క్లారిటీ ఇస్తామన్నారు. ఏటీఎస్‌అదుపులో ఉన్న బాలిక వయసు 18 ఏళ్లు. ఆరోతరగతి తర్వాత చదువు ఆపేసింది. తరచూ మొబైల్‌లో ఉంటుంటే గేమ్స్ ఆడుతుంది అనుకున్నాం అంటున్నారు తల్లిదండ్రులు. ఏటీఎస్ అధికారులు వచ్చే వరకూ ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ గురించిగానీ, ఆమె చాటింగ్స్ గురించిగానీ తెలియదంటున్నారు. అయితే అధికారులు చెప్పింది కూడా కేవలం అనుమానాలే అని, ఎలాంటి టెర్రర్ కోణాలను ధృవీకరించలేదని చెబుతున్నారు.
మరోవైపు హైదరాబాద్‌లోనూ విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు ఏటీఎస్ అధికారులు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతల్లో తనిఖీలు చేస్తున్నాయి. ఈక్రమంలో రామగుండంలో ఒకరు, వరంగల్‌లో ఇద్దురు, హైదరాబాద్‌లో ఇద్దరు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి కాలాపత్తర్ కు చెందిన (41) అదుపులోకి తీసుకున్న ఏటీఎస్ అధికారులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక టోలిచౌకి లో నివాసం ఉంటున్న మొహమ్మద్ జవీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అమీర్‌పేటలోని ఓ కోచింగ్ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్ ట్రైనర్‌గా జవీద్ పని చేస్తున్నారు. బక్రిద్ సందర్భంగా నాలుగు రోజుల క్రితం ఆయన తన కూతురితో రామగుండం వెళ్లారు. కోచింగ్ సెంటర్ కేంద్రంగా జవీద్ కార్యకలాపాలపై అరా తీస్తోంది ఏటీఎస్. ఈక్రమంలో అమీర్ పేటను జల్లెడ పడుతున్నారు. నాలుగు కోచింగ్ సెంటర్ ల సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. కోచింగ్ మాటున ఉగ్ర శిక్షణ ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు గుజరాత్ ఏటీఎస్ అధికారులు. వీరి వివరాలను పూర్తిగా ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు ఏటీఎస్ అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..