ఎలుకలను తరిమికొట్టే పవర్‌ఫుల్ వెపన్.. మీ ఇంట్లో ఇవి ఉండాల్సిందే! నేచురల్ చిట్కా..
ఖరీదైన ఎలుకల మందులు, బోనులతో పని లేకుండా మీ ఇంట్లో లేదా ఫామ్ హౌస్‌లో ఎలుకలను అదుపు చేయడానికి ప్రకృతి సిద్ధమైన మార్గం ఒకటుంది. అది గిన్ని కోళ్లను పెంచుకోవడం. వీటి గురించి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం ఇక్కడ ఉన్నాయి.

చాలా మందికి తమ ఫామ్ హౌస్‌లలో లేదా పల్లెటూరి ఇళ్లలో ఎలుకలు, పాములు, చిన్న చిన్న క్రిమి కీటకాల వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ధాన్యం బస్తాలను కత్తిరించడం నుండి వస్తువులను పాడు చేయడం వరకు ఎలుకల వల్ల వచ్చే నష్టం అంతా ఇంతా కాదు. వీటన్నింటికీ ఒక అద్భుతమైన పరిష్కారం ‘గిన్ని కోళ్లు’. వీటిని మన దగ్గర ‘సీమ కోళ్లు’ అని కూడా పిలుస్తుంటారు. ఇవి కేవలం అందం కోసమే కాదు, ఒక సెక్యూరిటీ గార్డ్‌లా మీ ఇంటిని కాపాడతాయి.
గిన్ని కోళ్లకు ఎలుకలన్నా, పాములన్నా అస్సలు పడదు. పొరపాటున ఏదైనా ఎలుక వీటి కంట పడిందంటే, దాని పని అయిపోయినట్టే. ఇవి గుంపులుగా ఉండి ఎలుకలను వెంటాడి వేటాడతాయి. వీటి అరుపులు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. ఏదైనా కొత్త వ్యక్తి లేదా కొత్త జీవి రాగానే ఇవి గట్టిగా అరుస్తూ యజమానిని అప్రమత్తం చేస్తాయి. అందుకే వీటిని ‘ప్రకృతి సిద్ధమైన అలారమ్స్’ అని కూడా అంటారు.
వీటిని పెంచడం కూడా చాలా సులభం. మన నాటు కోళ్ల లాగే ఇవి కూడా తక్కువ ఖర్చుతో పెరుగుతాయి. వీటికి ప్రత్యేకమైన షెడ్లు లేదా ఖరీదైన ఆహారం అవసరం లేదు. బయట దొరికే చిన్న పురుగులు, గడ్డి, గింజలు తిని ఇవి హాయిగా బతికేస్తాయి. ముఖ్యంగా తోటల్లో చెదలు, నత్తలు, గొంగళి పురుగులు వంటి వాటిని ఇవి ఏరిపారేస్తాయి, తద్వారా పంటలకు కూడా రక్షణ కలుగుతుంది. మీ ఇంట్లో లేదా పెరట్లో నాలుగైదు గిన్ని కోళ్లను పెంచడం వల్ల ఎలుకల మందులు వాడాల్సిన అవసరం రాదు, ఆరోగ్యానికి కూడా ఇది మంచిది.
