Telangana: కట్నం డబ్బుతో వరుడు పరార్‌.. వధువు చేసిన పనితో శుభం కార్డు.. కానీ

|

Dec 20, 2021 | 2:03 PM

సంగారెడ్డి జిల్లాలో కట్నం డబ్బుతో వరుడు పరారైన ఘటనలో పెళ్ల కథ సుఖాంతమైంది. వరుడు చేసిన పనికి ఆ నవవధువు, బంధుమిత్రులు పూనుకుని ఈ సస్పెన్స్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేశారు.

Telangana: కట్నం డబ్బుతో వరుడు పరార్‌.. వధువు చేసిన పనితో శుభం కార్డు.. కానీ
Groom Escape
Follow us on

సంగారెడ్డి జిల్లాలో కట్నం డబ్బుతో వరుడు పరారైన ఘటనలో పెళ్ల కథ సుఖాంతమైంది. వరుడు చేసిన పనికి ఆ నవవధువు, బంధుమిత్రులు పూనుకుని ఈ సస్పెన్స్ స్టోరీకి శుభం కార్డు పడేలా చేశారు. ఇంతకీ ఈ స్టోరీలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్‌ గ్రామానికి చెందిన సింధురెడ్డికి, కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన వరుడు న్యాయవాది అయిన మాణిక్‌రెడ్డితో పెళ్లి నిశ్చయించారు పెద్దలు. అయితే ఇచ్చిన కట్నం డబ్బుతో వరుడు పరారవడంతో డిసెంబర్‌ 12న జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. అమ్మాయి తరపువారు ఇచ్చిన కట్నం డబ్బు 25 లక్షల రూపాయలు, 12 తులాల బంగారం తీసుకుని.. పెళ్లికి గంటముందు వరుడు పరారయ్యాడని ఆరోపిస్తూ వధువు సింధురెడ్డి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని రూరల్‌ పోలీస్‌ స్టేషన్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తాను మోసపోయినట్లుగా ఎవరూ మోసపోకూడదని న్యాయపోరాటం చేసింది.

దీంతో ఇరు గ్రామాల పెద్దలు పెళ్లికొడుకు తల్లిదండ్రులతో కలిసి వరుడు మాణిక్‌రెడ్డిని వెతికి మళ్లీ పెళ్లికి ఒప్పించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డిపల్లి గ్రామంలో గల సంగేమేశ్వర ఆలయంలో గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరిపించారు. తనకు న్యాయం జరిగేలా కృషి చేసిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పింది పెళ్లికూతురు సింధుజ రెడ్డి.

అయితే ఇక్కడే కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  పెళ్లి కాకముందే కట్నం డబ్బుతో జంప్‌ అయినవాడు రేపు అదనపు కట్నం కోసం ఆ అమ్మాయిని వేధించడని గ్యారంటీ ఏమిటి?.. అసలు అలాంటివాడి నుంచి యువతి తల్లిదండ్రులకు కట్నం డబ్బులు తిరిగి ఇప్పించకుండా… పెద్దలు కూడా దగ్గరుండి పెళ్లి చేయడమేమిటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

 

Also Read: Aishwarya Rai: ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు ఈడీ సమన్లు.. ఆ కేసులో బిగుస్తోన్న ఉచ్చు

Andhra Pradesh: పిల్లలు కలగలేదని ఇల్లాలికి బొడ్డుతాడు తినిపించారు..పాపం చివరికి