Telangana: కొడుకు పెళ్లికి ఊరి ప్రజలు ఆప్యాయత కోసం ఆ తండ్రి ఏం చేశాడంటే…?

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. సకల దేవతలతో పాటు బంధుమిత్రుల ఆశీర్వాదం కోరుకుంటారు. తన కొడుకు పెళ్లిలో పెద్ద పెద్దోల్లే కాదు ఆప్యాయత చూపించే తమ ఊరి ప్రజలు కూడా కనబడాలి అనుకున్నాడు ఓ నాయకుడు. ఆ పెళ్లికి తమ గ్రామస్తులను ఆ నాయకుడు ఎలా ఆహ్వానించారో తెలుసుకుందాం పదండి ..

Telangana: కొడుకు పెళ్లికి ఊరి ప్రజలు ఆప్యాయత కోసం ఆ తండ్రి ఏం చేశాడంటే...?
Gundala Village Wedding

Edited By:

Updated on: Nov 22, 2025 | 10:10 AM

తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామ సర్పంచ్‌గా గతంలో మాధవి వ్యవహరించారు. మాధవి – మాధవ రెడ్డిల చిన్న కుమారుడు వరుణ్ కుమార్ రెడ్డి – అనీషారెడ్డిల వివాహం ఈ నెల 23న జహీరాబాద్ లో జరుగనుంది. వివాహాన్ని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భువి నుంచి సకల దేవతలతో పాటు బంధుమిత్రుల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాడు. అంతేకాదు ఆ పెళ్లిలో పెద్ద లీడర్లే కాదు తమ ఊరి ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలని భావించాడు. అందరికీ భిన్నంగా మాధవి – మాధవరెడ్డి దంపతులు ఊరంతా శుభలేఖతో పాటు ఇంటింటికి చీరను ఇచ్చి తమ కుమారుడి పెళ్లికి ఆత్మీయంగా ఆహ్వానించారు. గ్రామస్థుల కోసం ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాదు 26వ తేదీన గ్రామ ప్రజల కోసం ప్రత్యేక విందును కూడా ఏర్పాటు చేసి తమ ఇంటి శుభకార్యానికి గ్రామస్థులు అంతా రావాలని ఆహ్వానిస్తున్నారు. సొంత ఊరి ప్రజల పట్ల మాధవి – మాధవరెడ్డి దంపతులు చూపుతున్న ప్రేమాభిమానాలకు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వివాహానికి సకుటుంబ పరివారమే కాదు.. గ్రామమంతా వెళ్లి వధువు వరువులను ప్రేమతో ఆశీర్వదిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి