TGSRTC: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ కార్డు లేకున్నా ఉచిత బస్సు ప్రయాణం!

TGSRTC: మహిళలు ఉచిత ప్రయాణం చేయాలంటే గుర్తింపు కార్డుగా ఆధార్‌ చూపించాల్సి ఉంటుంది. అప్పుడు కండక్టర్‌ జీరో టికెట్‌ను అందిస్తారు. ఇటీవల నెటిజన్ల నుంచి వచ్చిన ప్రశ్నలకు స్పందించిన సజ్జనార్‌.. ఉచిత ప్రయాణానికి గుర్తింపుగా ఆధార్‌ కార్డుకు బదులు ఇతర గుర్తింపు కార్డులను..

TGSRTC: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ కార్డు లేకున్నా ఉచిత బస్సు ప్రయాణం!

Updated on: May 09, 2025 | 11:27 AM

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తోంది. అయితే మహిళలు బస్సు ప్రయాణం చేయాలంటే కండక్టర్‌కు ఆధార్‌ కార్డు ఒరిజినల్‌ చూపించాల్సి ఉంటుంది. దానిబట్టే ఉచిత ప్రయాణానికి అర్హులు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మహిళల కోసం మరో గుడ్‌న్యూస్‌ అందించారు. మహిళలు ఇకపై ఆర్టీసీ ఉచిత బస్సు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఆధార్‌ కార్డు లేకున్నా ప్రయాణించవచ్చని తెలిపారు. ఆధార్‌ కార్డు స్థానంలో ఏదైనా గుర్తింపు కార్డు అంటే.. ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి గుర్తింపు కార్డులను చూపించవచ్చని తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్టర్‌ ద్వారా వెల్లడించారు.

 


అయితే మహిళలు ఉచిత ప్రయాణం చేయాలంటే గుర్తింపు కార్డుగా ఆధార్‌ చూపించాల్సి ఉంటుంది. అప్పుడు కండక్టర్‌ జీరో టికెట్‌ను అందిస్తారు.  తెలంగాణాలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ‘జీరో’ టికెట్ కోసం ఆధార్ ఉంటే చాలా? అని ఓ నెటిజన్‌ ఎండీ సజ్జనార్‌ను అడుగగా, దీనిని బదులుగా సమాధాన్‌ ఇచ్చారు సజ్జనార్‌. ఉచిత ప్రయాణానికి గుర్తింపుగా ఆధార్‌ కార్డుకు బదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును చూపించి ప్రయాణించవచ్చని ప్రకటించారు. అంటే మహిళల వద్ద ఆధార్ కార్డు లేకున్నా ఇతర గుర్తింపు కార్డులను చూపించి కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీలో ఎన్నో మార్పులు చేపట్టారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి