interest-free loans to women : మహిళలు ఆర్థిక స్వాలంభన సాధించడమే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. ఇందులో భాగంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వడ్డీలేని రుణాలను విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగధాంపల్లిలో సుతారి సంఘం, మహిళా మండలి భవనం, ముదిరాజ్ సంఘం భవనాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రంగాధాం పల్లిలో 12 కుల సంఘాల భవనాలు నిర్మించామని తెలిపారు. 9వ మున్సిపల్ వార్డులో రూ.9 కోట్లు నిధులతో వివిధ అభివృద్ది పనులను చేశామన్నారు.
గత ప్రభుత్వాలు ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహలుగా మార్చాయని మంత్రి విమర్శించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఇందుకోసం సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ లకు బడ్జెట్ లో రూ. 500 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల బలోపేతం కోసమే నిధులు కేటాయించామన్నారు. కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు రూ.699 కోట్లు కోత పెడితే రాష్ట్ర ప్రభుత్వం కడుపు నింపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా ప్రతి నెల రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. సిద్దిపేట జిల్లాలో ఐటీ పార్కు, ఇండస్ట్రియల్ పార్క్‌లు రావడం ద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు మెరగయ్యాయన్నారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి కేంద్రీకృతం కాకుండి రాష్ట్రం నలుమూలాల విస్తరించేందుకు సీఎం కేసీఆర్ కృషీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.