గోరక్షక్‌ దళ సభ్యుడిపై రౌడీషీటర్ ఫైరింగ్‌ .. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్

జూబ్లీహిల్స్‌ ఎన్నికల వేళ మేడ్చల్‌ జిల్లాలో జరిగిన కాల్పులు రాజకీయ రగడకు దారి తీశాయి. గోరక్షక్‌ దళ సభ్యుడిపై రౌడీషీటర్ ఫైరింగ్‌ పొలిటికల్‌ పాలిటిక్స్‌కు తెరలేపాయి. పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.. అసలు ప్రభుత్వం అండతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు.

గోరక్షక్‌ దళ సభ్యుడిపై రౌడీషీటర్ ఫైరింగ్‌ .. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్
Firing Incident In Medchal

Updated on: Oct 23, 2025 | 9:07 AM

మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం రేపాయి. పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గో రక్షక్‌ దళ సభ్యుడు సోనుసింగ్‌పై కాల్పులు జరిపి పరారయ్యాడు ఇబ్రహీం అనే వ్యక్తి. ఈ కాల్పుల్లో సోనూసింగ్‌ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతో టీ పాయింట్ పక్కన పడిపోయిన సోనూ సింగ్‌ను స్థానికుల సమాచారంలో పోలీసు హుటాహుటిన శ్రీకర హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోనుసింగ్‌పై కాల్పులకు పాల్పడిన ఇబ్రహీంకు కబేలా ఉన్నట్లు తెలుస్తోంది. గోరక్ష దళ్‌లో యాక్టివ్‌గా ఉన్న సోనుసింగ్.. తన వ్యాపారానికి అడ్డు వస్తున్నాడని కక్షపెంచుకున్నాడు ఇబ్రహీం. టీ తాగేందుకు వస్తున్న సోనుసింగ్‌పై రెక్కీ నిర్వహించి మరీ కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం పారిపోయాడు. రౌడీ షీటర్ ఇబ్రహీం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోనుసింగ్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, టీబీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు, ఎంపీ ఈటల, పలువురు బీజేపీ నేతలు పరామర్శించారు. కాల్పుల ఘటనపై సీరియస్‌ స్పందించారు. ఈఘటనపై పోలీసులు, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే ముందుముందు పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.

ఈఘటనతో తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు. ప్రభుత్వం అండతోనే MIM రెచ్చిపోతోందని.. ఇప్పటికైనా గో రక్షక్‌లకు భద్రత కల్పించాలి డిమాండ్ చేశారు రాంచందర్‌రావు. మరోవైపు సోనుసింగ్‌పై కాల్పుల ఘటనతో యశోద ఆస్పత్రి దగ్గర హిందూ సంఘాలు ఆందోళన దిగాయి. గో రక్షక్ సోనుసింగ్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..