Hyderabad: సీఐడీ అధికారుల ముసుగులో ఘరానా మోసం.. కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్..

|

Jan 30, 2024 | 8:04 PM

ఏపీ సీఐడి అధికారులమంటూ.. ఓ ఐటీ కంపెనీని బురిడీ కొట్టించారు కొందరు కేటుగాళ్లు. కోట్లల్లో డీల్‌ సెట్ చేసుకుని.. లక్షల్లో డబ్బులు వసూలు చేసి.. చివరకు పోలీసులకు చిక్కారు. ట్విస్ట్ ఏంటంటే.. ఈ నకిలీ గ్యాంగ్‌లో ఏపీకి చెందిన ఎస్ఐ కూడా భాగస్వామి అయ్యాడు. డబ్బులకు కక్కుర్తి పడి.. కటకటాల పాలయ్యాడు. AJA యాడ్స్ అనే అమెరికన్ బేస్డ్ ఐటీ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా విధులు నిర్వహిస్తోంది.

Hyderabad: సీఐడీ అధికారుల ముసుగులో ఘరానా మోసం.. కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్..
Hyderabad Kidnap Case
Follow us on

హైదరాబాద్, జనవరి 30: ఏపీ సీఐడి అధికారులమంటూ.. ఓ ఐటీ కంపెనీని బురిడీ కొట్టించారు కొందరు కేటుగాళ్లు. కోట్లల్లో డీల్‌ సెట్ చేసుకుని.. లక్షల్లో డబ్బులు వసూలు చేసి.. చివరకు పోలీసులకు చిక్కారు. ట్విస్ట్ ఏంటంటే.. ఈ నకిలీ గ్యాంగ్‌లో ఏపీకి చెందిన ఎస్ఐ కూడా భాగస్వామి అయ్యాడు. డబ్బులకు కక్కుర్తి పడి.. కటకటాల పాలయ్యాడు. AJA యాడ్స్ అనే అమెరికన్ బేస్డ్ ఐటీ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా విధులు నిర్వహిస్తోంది. గత కొన్నేళ్ళుగా ఉద్యోగాలను ఇప్పిస్తోంది. కంపెనీలో పనిచేస్తున్న మాజీ ఉద్యోగి మరో 9మంది కలిసి.. ఏపి సిఐడి అధికారులమంటూ ఈ నెల 27న కంపెనీలోకి వెళ్లారు. ఆఫీసులోకి అక్రమంగా ప్రవేశించి తనిఖీలు నిర్వహించి డివిఆర్ స్వాధీనం చేసుకున్నారు నిందితులు.

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారని బెదిరించారు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే 10 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి.. చివరికి 2.3 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నారు. కంపెనీ డైరెక్టర్‌ దర్శన్‌ సహా మరో ఇద్దరిని కిడ్నాప్ చేసి ఓ హోటల్‌కి తీసుకెళ్లి.. 10 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు నిందితులు. డబ్బులు తీసుకుని దర్శన్‌ను వదిలేయడంతో.. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ తతంగానికి AJA యాడ్స్‌లో గతంలో పనిచేసిన రంజితే మూల కారణమన్నారు మాదాపూర్ డిసిపి వినీత్. కర్నూల్ డీఐజీ ఆఫీసులో ఎస్ఐగా పనిచేస్తున్న సుజన్‌తో కలిసి కుట్రపన్నారని చెప్పారు. రంజిత్, సుజనే ఈ స్కెచ్‌కు కర్త, కర్మ, క్రియ అని తేల్చారు. మొత్తం 8మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి 4 కార్లు, 16 సెల్‌ఫోన్లు సీజ్ చేశామన్నారు మాదాపూర్ డిసిపి వినీత్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..