తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారు ఉచితంగానే బస్సుల్లో ప్రయాణించవచ్చు

|

Mar 02, 2022 | 5:23 PM

తెలంగాణ ఆర్టీసీకి ఎండీగా నియామకం అయినప్పటి నుంచి ఐపీఎస్ అధికారి సజ్జనార్(Sajjanar).. తన మార్క్ నిర్ణయాలతో సంస్థలో కొత్త ఉత్తేజం నింపుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు..

తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారు ఉచితంగానే బస్సుల్లో ప్రయాణించవచ్చు
Tsrtc
Follow us on

తెలంగాణ ఆర్టీసీకి ఎండీగా నియామకం అయినప్పటి నుంచి ఐపీఎస్ అధికారి సజ్జనార్(Sajjanar).. తన మార్క్ నిర్ణయాలతో సంస్థలో కొత్త ఉత్తేజం నింపుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంతో పాటు, సంస్థను లాభాల దిశగా నడిపేందుకూ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. దీంతో నిరాశలో ఉన్న సంస్థ ఉద్యోగుల్లో కొత్త ఉత్తేజం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ(Telangana RTC).. మరో శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు తాజాగా మరో ఆకర్షణీయమైన స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. 250 కిలోమీటర్లకు పైగా దూర ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ ఆఫర్(Offer) వర్తిస్తుందని తెలిపింది. ముందుగా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు.. వారి ఇంటి వద్ద నుంచి బోర్డింగ్‌ పాయింట్‌ వరకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. హైదరాబాద్ లో ప్రయాణానికి 2గంటల ముందు, ప్రయాణం తర్వాత 2గంటల సమయం వరకు ఈ అవకాశం వర్తిస్తుందని వెల్లడించారు. ఈ నిర్ణయంపై ఆర్టీసీ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల సంక్రాంతి, మేడారం జాతర, మహాశివరాత్రి పర్వదినాలను పురస్కరించుకుని.. భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది.30 మందితో కూడిన భక్తులు ఒక గ్రూపుగా ఏర్పడితే తమ నివాసానికి సమీప ప్రాంతం నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఎండీ సజ్జనార్ నేతృత్వంలో 60 మంది అధికారుల బృందం మేడారం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్టాండ్ వద్దే బస చేసి ఆర్టీసీ సేవలను పర్యవేక్షించారు. ఈ జాతరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 4 వేల బస్సులను ఆర్టీసీ నడిపించింది. ఇందుకోసం 12,500 మంది సిబ్బంది విధులు నిర్వర్తించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను నడుపింది. పండుగ సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలనూ వసూలు చేయలేదు.

Also Read

Virata Parvam: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు విరాటపర్వం.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటి రానా..

Hyderabad: చెవి నొప్పితో ఆస్పతికి వెళ్లిన మహిళ.. అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. తెల్లారేసరికి ఊహించని షాక్

Samantha: చై తో విడాకుల అనంతరం ‘అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను’ అంటూ సమంత ఎమోషనల్ పోస్ట్..