
ఆదిలాబాద్ ఎచోడ మండలం సల్యాడ గ్రామంలో మంగళవారం తమ పొలాల్లో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నారనే ఆరోపణలపై నలుగురిని అరెస్టు చేశారు. నలుగురి నుంచి రూ.18 లక్షల విలువైన 180 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సల్యాడ గ్రామానికి చెందిన చాహకటి సోనేరావ్, దుర్వా లవకుష్, అర్కా జంగాబాపు, దుర్వా అరుణ్‌లను పంటను పెంచుతున్నందుకు అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో.. త్వరగా డబ్బు సంపాదించడానికి గంజాయి పండిచినట్లు నిందితులు ఒప్పుకున్నారు. సోనెరావ్ 17 మొక్కలు పెంచగా.. లవకుష్ 86, జంగుబాపు 31, అరుణ్ 46 గంజాయి మొక్కలను పెంచారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కొనుగోలుదారులకు విక్రయించడానికి పంటను పండించినట్లు వారు అంగీకరించారు. కాగా ఈ తరహా.. చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి 87126 59973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. డ్రగ్ పెడ్లర్లు, వ్యాపారులు, వినియోగదారులను గుర్తించడం ద్వారా ఈ ముప్పును నిర్మూలించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దాడులు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నందుకు పోలీసు అధికారులను ఆయన అభినందించారు.