
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ OSD ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. జూన్ 5వ తేదీన ఈ కేసు వ్యవహారంలో విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ ఇప్పటికే సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రావు అండర్ టేకింగ్ లెటర్ రాసిచ్చినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాలతో14 నెలల పాటు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు భారత్‌కు తిరిగి రాబోతున్నారు.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక నిందితుడుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని విచారిస్తే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశముందని దర్యాప్తు బృందం భావిస్తుంది. ఆ క్రమంలో ప్రభాకర్ రావును విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో స్వదేశానికి తిరిగి వస్తున్నారు ప్రభాకర్ రావు.
ప్రభాకర్ రావు గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) OSDగా విధులు నిర్వహించారు. ప్రభాకర్ రావుపై లుకౌట్, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఆయన పాస్‌పోస్ట్ రద్దు చేశారు. వీసా గడువు ముగిసింది. వీటన్నింటికి మించి రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. దీంతో భారత్ రావడం తప్పనిసరి అయ్యింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..