అర్థరాత్రి ఆపదలో ఉన్న తల్లీబిడ్డకు అండగా.. మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. నాలుగు నెలల చంటిబిడ్డకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ప్రవళిక అనే మహిళ రాత్రి ఒంటి గంట సమయంలో ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంది. పాపలో ఎలాంటి చలనం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె మహిళల వార్డు సమీపంలో సహాయం కోసం ఎదురుచూస్తూ నిలిచింది.

అర్థరాత్రి ఆపదలో ఉన్న తల్లీబిడ్డకు అండగా.. మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
Former Mla Jagga Reddy

Updated on: Aug 06, 2026 | 8:06 AM

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. నాలుగు నెలల చంటిబిడ్డకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ప్రవళిక అనే మహిళ రాత్రి ఒంటి గంట సమయంలో ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంది. పాపలో ఎలాంటి చలనం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె మహిళల వార్డు సమీపంలో సహాయం కోసం ఎదురుచూస్తూ నిలిచింది.

అదే సమయంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీ కోసం వచ్చారు. ఆస్పత్రి ప్రాంగణంలో చంటిపాపను ఎత్తుకుని నిల్చొని ఉన్న ప్రవళికను గమనించిన ఆయన, ఆమెను పలకరించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన భర్త ఇంట్లో లేడని, పాపకు ఫిట్స్ రావడంతో ఒక్కదాన్నే ఆస్పత్రికి తీసుకొచ్చానని ప్రవళిక వివరించింది.

దీంతో వెంటనే స్పందించిన జగ్గారెడ్డి, తల్లీబిడ్డను తన అధికారిక కారులో ఎక్కించుకుని మాతా శిశు ఆస్పత్రి (ఎంసీహెచ్)కు తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యులతో స్వయంగా మాట్లాడి, చిన్నారికి ఆలస్యం కాకుండా అత్యవసర చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే చొరవతో వైద్య సిబ్బంది వెంటనే చికిత్స ప్రారంభించారు.

అత్యవసర పరిస్థితిలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి, తక్షణమే వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్న జగ్గారెడ్డి తీరుపై అక్కడున్న రోగుల బంధువులు, స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us