
హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద అమెజాన్ సెంటర్ ఉన్న విషయం తెలిసిందే..! ఈ అమెజాన్ రిలే సెంటర్ నుండి దాదాపు 102 కోట్ల రూపాయల బిల్స్ ను సొంత ఉద్యోగులే కాజేశారు. ఈ విషయంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వస్తువును డెలివరీ చేసేందుకు అమెజాన్ ఏజెంట్‌కు ఒక ప్రత్యేకమైన యాప్ రూపొందిస్తారు. సదరు యాప్ లో కస్టమర్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేసి ఏజెంట్‌కు పంపిస్తారు.
వినియోగదారుడికి వస్తవును డెలివరీ చేసేందుకు ఏజెంట్ ఎంత దూరం వెళ్తాడో దాన్ని నిర్ధారించి ఏజెంట్‌కు డబ్బులు చెల్లిస్తారు. ఒకవేళ వినియోగదారుడు సంబంధిత అడ్రస్ లేకపోతే, డెలివరీ ఏజెంట్ ప్రయాణించిన డిస్టెన్స్‌ను హైదరాబాద్‌లోని అమెజాన్ రిలే సెంటర్ నుండి వాటిని పర్యవేక్షిస్తారు. డిస్టెన్స్‌ను బట్టి డెలివరీ ఏజెంట్‌కు డబ్బులు చెల్లిస్తారు. ఇందుకు సంబంధించి డెలివరీ ఏజెంట్ కొన్ని బిల్లులు పెట్టాల్సి ఉంటుంది. వాటిని అమెజాన్ రిలే సెంటర్‌లోని కొందరు ఉద్యోగులు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిని అదునుగా చేసుకుని కొంత మంది ఉద్యోగులు, ఏజెంట్లు కుమ్మకై ఈ తరహా స్కామ్‌కు పాల్పడ్డారు. దీంతో సంస్థ ప్రతినిధులు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఎలాంటి డెలివరీ లేకున్నా సరే , ట్రావెల్ చేసినట్టు ఏజెంట్‌తో బిల్స్ పెట్టించారు. అలా వచ్చిన ఫేక్ బిల్లులకు అమెజాన్ రిలే సెంటర్‌లోని కొంత సిబ్బంది జత కట్టారు. మొత్తం 18 మంది ఒక ముఠాగా ఏర్పడి 102 కోట్లు రూపాయలు లబ్ధి పొందారు. ఈ రూ.102 కోట్లు మోసం చేసినట్టు ఆడిట్ నిర్వహిస్తే తెలిసిందని అమెజాన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విషయం మొత్తం తెలుసుకుని సైబర్ సెక్యూరిటీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ మొత్తం స్కామ్‌లో కొంత మంది పాత ఉద్యోగుల పాత్ర కూడా ఉందని అమెజాన్ సంస్థ అనుమానిస్తోంది.
ఇప్పుడు స్కామ్‌కు పాల్పడింది అమెరికా డెలివరీ అడ్రస్ ఉపయోగినట్టు గుర్తించారు. అమెరికాలో ఏజెంట్ డెలివరీకి వెళ్లినట్టు సృష్టించా.రు అక్కడ వినియోగదారుడు లేడు అని క్రియేట్ చేశారు. చివరిగా తాము ట్రావెల్ చేసిన బిల్స్‌ను సృష్టించి హైదరాబాద్‌లోని అమెజాన్ రిలే సెంటర్ నుండే అసలు తతంగం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..