CM KCR: సీఎం కేసీఆర్‌తో గుజరాత్‌ మాజీ సీఎం శంకర్‌సింగ్‌ భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ..

టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో గుజరాత్‌ మాజీ సీఎం శంకర్‌సింగ్‌ వాఘేలా భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌ నరగానికి చేరుకున్న ఆయన.. మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

CM KCR: సీఎం కేసీఆర్‌తో గుజరాత్‌ మాజీ సీఎం శంకర్‌సింగ్‌ భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ..
Cm Kcr

Updated on: Sep 16, 2022 | 5:35 PM

Shankersinh Vaghela Meet CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో పలు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు.. సీఎం కేసీఆర్‌తో భేటీ అవుతుండటం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తాజాగా.. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో గుజరాత్‌ మాజీ సీఎం శంకర్‌సింగ్‌ వాఘేలా భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌ నగరానికి చేరుకున్న ఆయన.. మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్, శంకర్‌సింగ్‌ వాఘేలా చర్చించారు.

ముందుగా ప్రగతిభవన్‌కు వచ్చిన గుజరాత్‌ మాజీ సీఎం శంకర్‌సింగ్‌ వాఘేలాను సీఎం కేసీఆర్‌ స్వాగతం పలికారు. అనంతరం ఆయన్ను సత్కరించారు. ఈ సమావేశంలో సిరికొండ మధుసూధనాచారి, బాల్కా సుమన్ తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు.. సీఎం కేసీఆర్‌ త్వరలో పార్టీని ప్రకటిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో శంకర్‌సింగ్ వాఘేలాతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల సీఎం కేసీఆర్.. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి తదితరులతో కూడా సమావేశమైన విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us