Rapolu: అనేక క్రియాశీలక నిర్ణయాలు తీసుకున్నారు, ఇది కూడా తప్పనిసరిగా జరపాలి.. ప్రధానికి రాపోలు లేఖ

|

Aug 31, 2021 | 1:57 PM

కులాల వారీగా జన గణన చేపట్టాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత రాపోలు ఆనంద భాస్కర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా

Rapolu: అనేక క్రియాశీలక నిర్ణయాలు తీసుకున్నారు, ఇది కూడా తప్పనిసరిగా జరపాలి.. ప్రధానికి రాపోలు లేఖ
Ra
Follow us on

Rapolu Ananda Bhaskar Letter – PM Modi: కులాల వారీగా జన గణన చేపట్టాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత రాపోలు ఆనంద భాస్కర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా, ప్రధానంగా దక్షిణాది రాష్త్రాల్లో ఉన్న డిమాండ్ మేరకు కులాల వారీగా జనగణన చేయాలని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మోదీ ఆధ్వర్యంలో అనేక క్రియాశీలక నిర్ణయాలు తీసుకున్నారన్న ఆనంద్ భాస్కర్.. ఈ కులాల ఆధారిత జనగణన కూడా మోడీ నేతృత్వంలో జరగాలని అన్నారు.

కేంద్ర మంత్రిత్వ శాఖలు, కమిటీల సూచనల మేరకు మోదీ కులాల వారీగా జనగణనపై నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రధానికి రాసిన లేఖలో కోరారు. సెప్టెంబర్ 17న మోదీ జన్మదినం సందర్భంగా కులాల ఆధారిత జనగణనకి శ్రీకారం చుట్టాలని ఆయన కోరారు. కులాల వారీగా జనగణన వల్ల సామాజిక న్యాయం, కేంద్ర పథకాలు పారదర్శకంగా వెనకబడిన తరగతులకి అందే అవకాశం ఉంటుందని భాస్కర్ అభిప్రాయపడ్డారు.

కాగా, మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘ కాలం వివిధ హోదాల్లో కొనసాగిన ఉండిన రాపోలు ఆనంద భాస్కర్‌ 2019 ఏప్రిల్‌లో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Read also: KTR: సెప్టెంబర్ 2న జరిగే పార్టీ జెండా పండగ అదిరిపోవాలి.. వీడియో కాన్ఫెరెన్స్‌లో కేటీఆర్ దిశా నిర్దేశం