బాబోయ్ చిరుత..! చిక్కదు.. దొరకదు.. అటవీశాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది..

| Edited By: Jyothi Gadda

Jun 25, 2024 | 1:24 PM

కొద్దిరోజుల క్రితమే రన్ వే పైకి వచ్చినటువంటి చిరుత కొద్దిరోజుల వ్యవధిలోనే మరోసారి కనిపించీ కనిపించకా కలకలం రేపుతోంది.  అడవుల్లో నుండి వచ్చి గ్రామాల్లో చొరబడడంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అయితే రన్ వేపై పట్టుబడిన చిరుత..

బాబోయ్ చిరుత..! చిక్కదు.. దొరకదు.. అటవీశాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది..
Leopard Ghansimiaguda Villa
Follow us on

శంషాబాద్ ఘాన్సీమియాగుడా గ్రామంలో చిరుత కలకలం సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితమే శంషాబాద్ రన్వే పైకి వచ్చినటువంటి చిరుత, అటు గ్రామస్తులకు అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎట్టకేలకు అది బోనుకు చిక్కింది. తాజాగా మరోసారి చిరుత సంచరించడంతో గాన్సీమియా గూడ ప్రాంతవాసులు క్షణక్షణం భయం గుప్పిట్లో గడుపుతున్నారు. అసలు చిరుత ఎలా ఆ గ్రామంలోకి ఎంటర్ అయింది..? ప్రస్తుతం చిరుత ఎక్కడ సంచరిస్తోంది..? అటవీ శాఖ అధికారులు చరితను పట్టుకునేందుకు ఎటువంటి ఏర్పాటు చేశారు ఈ స్టోరీ లో చూద్దాం…

ఘాన్సీమియా గూడ గ్రామంలో చిరుత సంచారం కలకలంగా మారింది. గ్రామంలోకి ఎంటర్ అయిన చిరుత మొదటగా రెండు లేగ దూడలపై దాడి చేసింది. అడ్డొచ్చిన కుక్కపై కూడా దాడి చేసి చంపేసింది. ఈ దాడిలో మూడు జంతువులు మృతిచెందాయి. అయితే లేగ దూడలను పెంచుకుంటున్న యజమాని తొలుత వాటిని చూసినప్పుడు.. ఏదో గుర్తు తెలియని జంతువు చంపి ఉంటుందని అనుమానించాడు. ఆ తరువాత అక్కడ కనిపించిన కాలి ముద్రలను చూసి చిరుతగా క్లారిటీ కి వచ్చారు. ఆ వెంటనే అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా, కాలి ముద్రలను సేకరించి పరిశీలిస్తున్నారు. చిరుత సంచరించినటువంటి ప్రాంతాలలో సీసీ కెమెరాలను పరిశీలించినటువంటి అధికారులు.. అది జంగిల్ క్యాట్ లేదంటే, చిన్న పాంతర్‌గా అనుమానిస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు అది చిరుత అని స్పష్టం చేయడం లేదు అటవీశాఖ అధికారులు.

సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా చిరుతకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కాదని చెబుతున్నప్పటికీ, దాడి చేసినటువంటి ప్రాంత పరిధిలో రెండు బోన్లను, 20 ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. దూడలను చంపితిన్నటువంటి ప్రాంత పరిధిలోనే ఒక నీటి కొలను కూడా ఉంది. చంపి తిన్న తర్వాత నీళ్లు తాగేందుకు ఆ కొలను వద్దకు వచ్చే అవకాశాలు ఉండడంతో కొలను పరిధిలోనే కుక్కను ఎరగా వేసి బోను ఏర్పాటు చేశారు. నిన్న ఏర్పాటు చేసినటువంటి ట్రాక్ కెమెరాలలో ఇప్పటివరకు చిరుతకు సంబంధించి ఎటువంటి కదలికలు ఎక్కడా కూడా కనిపించలేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ గాన్సీమియా గ్రామస్తులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ చిరుతపులల భయం నుండి తమకు విముక్తి కలిగించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. ఇక మరోవైపు అటవీశాఖ అధికారులు, అది చిరుతనా లేదా మరేదైనా జంతువా అనే దానిలో ట్రాక్‌ కెమెరా దృశ్యాల ఆధారంగా ఒక క్లారిటీకి రానున్నారు. ప్రస్తుతం అటు గ్రామస్తులను మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్ చేశారు. రాత్రుళ్లు ఎవరూ బయటకు రావొద్దని, ఒకవేళ అత్యవసరంగా పనులకు వెళ్లాల్సి వస్తే గుంపులుగా ఉండాలని సూచించారు. ఎవరికైనా చిరుత ఆనవాళ్లు కనిపించినా, మరెక్కడైనా దాడికి పాల్పడిన సమాచారం ఇవ్వాల్సిందిగా గ్రామస్తులకు తెలియజేశారు అటవీ శాఖ అధికారులు.

కొద్దిరోజుల క్రితమే రన్ వే పైకి వచ్చినటువంటి చిరుత కొద్దిరోజుల వ్యవధిలోనే మరోసారి కనిపించీ కనిపించకా కలకలం రేపుతోంది.  అడవుల్లో నుండి వచ్చి గ్రామాల్లో చొరబడడంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అయితే రన్ వేపై పట్టుబడిన చిరుత ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి చిరుతగా గుర్తించారు అటవీశాఖ అధికారులు. ఆ తర్వాత దానిని జూ పార్క్ కు తరలించారు.  అనంతరం తిరిగి మళ్లీ అడవుల్లోకి వదిలివేశారు. ఇప్పుడు చిరుత కలకలంతో మరోసారి అప్రమత్తమయ్యారు అటవి శాఖ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..