హైదరాబాద్‌లో మరోసారి అగ్నిప్రమాదం.. రామంతపూర్‌లోని ఓ గోడౌన్‌లో చెలరేగిన మంటలు..

|

Feb 04, 2023 | 12:29 PM

గోదాంలో శనివారం తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటల్లో గోడౌన్‌లోని విలువైన ఫర్నిచర్‌, సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలిసింది. మంటలు భారీగా ఎగిసి పడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది.

హైదరాబాద్‌లో మరోసారి అగ్నిప్రమాదం.. రామంతపూర్‌లోని ఓ గోడౌన్‌లో చెలరేగిన మంటలు..
Fire Accident In Furniture
Follow us on

హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రామంతపూర్‌లోని ఓ ఫర్నీచర్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి.. షార్ట్ సర్క్యూట్ కారణంగా గోడౌన్‌లో మంటలు చెలరేగినట్టుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే భారీగా మంటలు చెలరేగడంతో.. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. మరోవైపు గౌడౌన్ లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

రామంతపూర్ లోని ఈజీ ఫ్టైవుడ్‌ గోదాంలో శనివారం తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటల్లో గోడౌన్‌లోని విలువైన ఫర్నిచర్‌, సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలిసింది. మంటలు భారీగా ఎగిసి పడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్మేసింది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదంతో సంభవించిన ఆస్తినష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా గోడౌన్ లు, హెడ్‌ ఆఫీసులాంటి ప్రదేశాల్లో ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అగ్నిప్రమాదాల కారణంగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టంతో పాటు పలుచోట్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.. మరోవైపు జనావాసులు ఉంటున్న ప్రాంతాల్లో ఈ తరహా ప్రమాాదాలు జరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి గోడౌన్‌లపై విస్తృత తనిఖీలు నిర్వహించాలని, ఆయా గోదాంల అనుమతులను పరిశీలించాలని కోరుతున్నారు. సరైన ఫైర్ సెఫ్టీ నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్నారా ..? లేదా అనేది ఖచ్చితంగా నిర్ధారించుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..