Harish Rao: ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు.. బీజేపీపై విరుచుకుపడ్డ హరీష్ రావు..

|

Nov 12, 2021 | 3:08 PM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎంతో పని చేశారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు....

Harish Rao: ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు.. బీజేపీపై విరుచుకుపడ్డ హరీష్ రావు..
Harish
Follow us on

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎంతో పని చేశారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం కోసం ధర్నాలు చేశామి, కానీ ఈ రోజు దుక్కి దున్నే రైతన్నల కోసం చేస్తున్నామని చెప్పారు. గతంలో వడ్లు కొనక పోయినా, విద్యుత్ సరఫరా కోసం, ఎరువుల కొరత కోసం ధర్నా చేశామని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత నీటికి ఏ కష్టం లేకుండా పోయిందని, ఈ ఘనత కేసీఆర్‎కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ వచ్చాక బోర్ బండ్లు, ట్రాన్స్‎ఫార్మర్ల రిపేర్, కరెంట్ మోటర్ రిపేర్ దుకాణాలు మూతపడ్డాయని చెప్పారు.

నీరు, కరెంటు, ఎరువుల కోసం కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఢిల్లీ వాళ్లు యాసంగిలో దొడ్డు వడ్లు కొనమని చెబుతున్నారని అన్నారు. బీజేపీ సోషల్ మీడియా తెలంగాణ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. రైతులు చనిపోతే వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయల బీమా కల్పిస్తుందని తెలిపారు. 30 వేల కోట్లు రూపాయల నిధులు రైతుల కోసం ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. 70 ఏళ్లలో ఒక్క గోదాము కడితే,7 సంవత్సరాల్లో 70 మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించామని చెప్పారు. బీజేపీ కొత్త విద్యుత్ విధానం తీసుకొచ్చిందని విమర్శించారు. పక్క రాష్టంలో ముఖ్యమంత్రి పొలాల్లో మీటర్ పెడితే, మన ముఖ్యమంత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పంట పొలాల్లో విద్యుత్ మీటర్లు పెట్టమని చెప్పారని తెలిపారు.

ఒక్కపుడు జై కిసాన్ అనే నినాదం ఉండేది, కానీ బీజేపీ పాలన నై కిసాన్ అనే నినాదంతో నడుస్తుందని విమర్శించారు. కేంద్ర బీజేపీ నాయకులు దొడ్డు బియ్యం కొనం అంటే రాష్ట్ర బీజేపీ నాయకులు కొంటామని చెబుతున్నారని అన్నారు. వడ్లు కొనకపోతే పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. రైతుల ను ఉగ్రవాదులతో పొలుస్తున్నారని అన్నారు. ఒక వర్గానికి చెందిన వాళ్లను దేశ భక్తులుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
నల్ల వ్యవసాయ చట్టాలు వద్దు, దొడ్డు వడ్లు కొనండి, గ్యాస్ ధర తగ్గించండి అని అడిగితే బీజేపీ సోషల్ మీడియా దేశ ద్రోహిగా ప్రచారం చేస్తుందని ఆరోపించారు.

బీజేపీ సోషల్ మీడియా కోసం ఓ కాలేజిని స్థాపించి తప్పుడు ప్రచారాలు చేస్తుందని విమర్శించారు. రేపు ఢిల్లీలోకూడా ఎంపీలు నిరసన ప్రదర్శనలు చేపడతారని తెలిపారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని యాసంగిలో వడ్లు కొనకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. బడా వ్యాపారులకు ఎన్నో కోట్ల రూపాయలు మాఫీ చేసిన కేంద్రం రైతులను చిన్న చూపు చూస్తుందని అన్నారు.

Read Also.. Huzurabad by-election: అసలేం జరిగిందో తెలియాలి.. హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హై కమాండ్ పోస్ట్ మార్టమ్