భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలానికి చెందిన రమాదేవి అనే మహిళ 52ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చింది. సత్యనారాయణ, రమాదేవి దంపతుల కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమార్తెకు వివాహం కావడంతో తమకు పిల్లలు కావాలనే ఉద్దేశంతో అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. రమాదేవికి రక్తపోటు, ఇతర సమస్యలు ఉన్నప్పటికీ చివరకు సంతానం కలిగింది. సాధారణ ప్రసవంలోనే ఇద్దరు ఆడశిశువులు జన్మించారు. ఇద్దరు ఆడశిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.