Manasa Varanasi : తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస వారణాసి బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలిచారు. హరియాణా యువతి మానిక శికంద్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాన్యసింగ్ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పులకిత్ సమ్రాట్, ప్రముఖ డిజైనర్ ఫల్గుణి వ్యవహరించారు.
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 విజేతగా నిలిచిన మానస వారణాసి.. పుట్టింది హైదరాబాదులోనే. ఆమె వయసు 23 సంవత్సరాలు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మానస ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అనలిస్ట్‌గా పనిచేస్తోంది. పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం, యోగా చేయడం మాసనకు ఇష్టమైన పనులు. మానస చిన్నతనం నుంచి సైలెంట్‌గా ఉండే అమ్మాయి.. భారత నాట్యం, సంగీతంలో కూడా మాసనకు అనుభవం ఉంది. డిసెంబర్ 2021లో జరిగే 70వ మిస్ట్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున పాల్గోననుంది.
ఇవి కూడా చదవండి: