Crime news: కన్న తండ్రి అని కూడా చూడకుండా.. పారతో కొట్టి చంపాడు.. విచారణలో షాకింగ్ విషయాలు

పచ్చని కుటుంబంలో మద్యం రాక్షసి చిచ్చు పెడుతోంది. కుటుంబాన్ని నిలువునూ ముంచుతోంది. మద్యానికి అలవాటైన తండ్రి కారణంగా పరువు పోతుందని భావించిన ఓ తనయుడు.. సొంత తండ్రినే హత్య...

Crime news: కన్న తండ్రి అని కూడా చూడకుండా.. పారతో కొట్టి చంపాడు.. విచారణలో షాకింగ్ విషయాలు
Wife Murder

Updated on: Mar 19, 2022 | 9:10 PM

పచ్చని కుటుంబంలో మద్యం రాక్షసి చిచ్చు పెడుతోంది. కుటుంబాన్ని నిలువునూ ముంచుతోంది. మద్యానికి అలవాటైన తండ్రి కారణంగా పరువు పోతుందని భావించిన ఓ తనయుడు.. సొంత తండ్రినే హత్య (Murder) చేయించాడు. రూ.లక్షకు సుపారీ ఇచ్చి మరీ ఈ దురాగతానికి పాల్పడ్డాడు. తెలంగాణలోని నిజామాబాద్‌ (Nizamabad) జిల్లా ఆర్మూర్‌ పట్టణానికి చెందిన అబ్దుల్‌ అహజ్‌ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఇసుక వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. అతని భార్య ఇటీవలే అనారోగ్యంతో మృతి (death) చెందారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన అబ్దు్ల్ మద్యానికి బానిసయ్యాడు. ఇలా మద్యం తాగుతూ కనిపించిన ప్రతి వారితో గొడవ పడేవాడు. తండ్రి ప్రవర్తనతో విసిగిపోయిన కుమారుడు ఫైజల్‌ పద్ధతి మార్చుకోవాలని నచ్చజెప్పాడు. అయినా అబ్దుల్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తండ్రిని అంతమొందించాలని నిర్ణయించాడు. హత్యకు లారీ డ్రైవర్‌ శశికాంత్‌పూరీతో రూ.లక్షకు సుపారీ కుదుర్చుకున్నాడు.

ఈ నెల 14వ తేదీ రాత్రి ఇసుక కోసం బిచ్కుంద మండలంలోని ఖద్గాం క్వారీకి వచ్చాడు. ఆ సమయంలో తాగిన మైకంలో ఉన్న అబ్దుల్ ను పారతో తలపై కొట్టి హత్య చేశారు. హత్యను ప్రమాదంగా నమ్మించేందుకు మృతదేహాన్ని ఇసుకలో పడేసి లారీతో తొక్కించి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసుల దర్యాప్తులో లారీ డ్రైవర్‌పై అనుమానం రావడంతో విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Also Read

Manjima Mohan: కార్తిక్‌తో ప్రేయాయణం!.. అసలు విషయం చెప్పేసిన మంజిమ..

రిజిస్ట్రేషన్ల వ్యవస్థ పారదర్శకతకు ఏపీ సర్కార్ శ్రీకారం.. ఆన్‌లైన్‌లో నాన్‌–జ్యుడిషియల్‌ స్టాంపు పేపర్ల విక్రయాలు

Tihar Jail: పెరోల్ పై బయటకు.. ఏడాదిన్నర అయినా తిరిగి రాలేదు.. తిహార్ జైలులో కలకలం