
ప్రస్తుతం రబీ సీజన్ ఆరంభమైంది. విత్తనాలు విత్తడానికి ఇదే అనుకూలమైన సమయం. అయితే వరి మినహా ఇతర పంటలు సాగు చేయాలంటే రైతన్నలు భయపడుతున్నారు. ఈ పంటలకు మద్దతు ధర లేకపోవడం కారణం కాదు, కోతుల భయానికి. కూరగాయాలతో పాటు వేరుశనగ, మొక్కజొన్న, కందులు, పెసర్లు, మి నుములు లాంటి పంటలు వేయలేకపోతున్నారు. విత్తనాలు విత్తిన వెంటనే కోతులు తినేస్తున్నాయి, దీంతో వరి మినహా మిగతా పంటలు వేయాలంటే రైతులు భయపడుతున్నారు. ఆరు తడి పంటలకు డిమాండ్ ఉన్నా కోతుల కారణంగా ఈ సాగుకు మొగ్గు చూపడం లేదు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 250కు పైగా గ్రామాల్లో కోతులు బెడద ఉంది.. ఇటీవల గ్రానైట్ తవ్వకాల కారణంగా కొండల్లో ఉండాల్సిన కోతులు గ్రామాల్లో చేరిపోయాయని అంటున్నారు. దీంతో తిండి కోసం యుద్ధం చేస్తున్నాయి. ఈ రెండేళ్లలో కోతుల సంతానం భారీగా పెరిగిపోయింది. మనుషుల కంటే కోతుల సంఖ్యే ఎక్కువగా కనబడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో వేరుశనగ, మొక్కజొన్న, కంది, పెసర్లు, బబ్బెర, ఎనుము, ఇతర ఆరుతడి పంటలను సాగు చేశారు. ఇటీవల మొక్కజొన్న మినహా మిగతా పంటలకు మద్దతు ధరను పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం.
అయితే.. ఈ పంటలను సాగు చేద్దామంటే.. కోతులు ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి పంటలు సాగు చేసే ఆవకాశం ఉన్న ఎర్ర నేల భూములు కూడా నారుమల్లుగా మారిపోతున్నాయి. అంతేకాదు… ఇప్పుడు బీడుగా పెడుతున్నారు. భారీ వర్షం కురిస్తే మాత్రం నాటు వేయనున్నారు. ఒకవేళా విత్తనాలు వేసినా కోతులు వెంటనే వాటిని తినేస్తున్నాయి. ఒకవేళ పంటను ఎంతో జాగ్రత్తగా కాపాడుకొచ్చినా.. పంట చేతికొచ్చే సమయానికి కోతులు దాడి చేసి పంటను నాశనం చేస్తున్నాయి. దీంతో ఇలాంటి పంటలను సాగు చేయడం మానేశారు రైతులు. కూరగాయలను సాగు చేయాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది.
చివరకు.. మిర్చిని కూడా తింపి కింద పడవేస్తున్నాయి. మానకొండూరు, తిమ్మాపూర్, శంకరపట్నం చిగురుమామిడి, రామడుగు, గంగాధర, మల్యాల, కొడిమ్యాల తదితర మండలాల్లో కోతులు అధికంగా ఉన్నాయి. కోతుల భయానికి ఇతర పంటలు వేస్తున్నారు. ఈ సంవత్సరం కోతుల ప్రభావం ఉన్న గ్రామాల్లో వరి మినహా.. ఇతర పంటలు వేయడం లేదు. పప్పుదినుసులకు మద్దతు ధర ఉన్నా, సాగు చేసుకోలేని పరిస్థితి ఉంది. కోతులను పట్టుకొని దట్టమైన ప్రాంతాల్లో వదిలి పెట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు. కోతుల కారణంగా కూరగాయాల సాగుతో పాటు వరి మి నహా.. ఇతర పంటలను సాగు చేసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..