Telangana: టెక్నలాజియా… టెక్నలాజియా.! పంట పొలాల్లో ఓ రైతు ఏం చేశాడంటే.?

ఏనుగు అరుపు సౌండ్ కలిగిన పరికరంతో పంట పొలాన్ని కాపాడుకుంటున్న రైతు మొక్కజొన్న పంటను నాశనం చేస్తున్న కోతుల నివారణకు రైతన్న వినూత్న పరికరాన్ని అమర్చి కోతుల బెడదకు చెక్ పెట్టాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి మరి.

Telangana: టెక్నలాజియా… టెక్నలాజియా.! పంట పొలాల్లో ఓ రైతు ఏం చేశాడంటే.?
Farm Land

Edited By:

Updated on: Aug 22, 2025 | 12:38 PM

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎలాబోతారం గ్రామానికి చెందిన మేకల మహిపాల్ రెడ్డి తనకున్న రెండు ఎకరాల భూమిలో మొక్కజొన్న పంట వేశాడు. పంట పొలంలోకి కోతులు చొరబడి పంట నష్టం చేయడంతో రైతు ఎలాగైనా కోతుల బెడదను నివారించాలని, హుజరాబాద్‌లోని ఒక ఎలక్ట్రికల్ షాపులో పెద్దగా ధ్వని వినిపించే పరికరాన్ని తీసుకువచ్చాడు. పంట పొలం పక్కన విమర్శి కోతుల బెడద నుంచి తప్పించుకున్నాడు.

ఈ పరికరానికి వివిధ రకాల వినికిడలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని స్థానిక వ్యక్తి తెలిపాడు. దీనికి బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చని, ఈ పరికరం యు అండ్ ఐ అనే కంపెనీ పేరు ఉందని చెప్పుకొచ్చాడు. ఈ పరికరం ఉపయోగించడం వల్ల చాలా వరకు వివిధ రకాల జంతువుల నుంచి పంట కాపాడుకుంటున్నానని చెప్పాడు. ఈ పరికరంలో ప్రస్తుతం ఏనుగు అరుపులు రికార్డింగ్ చేసి పెట్టానని దీంతో పంట చుట్టుపక్కల ప్రాంతాలకు జంతువులు రావడానికి భయపడుతున్నాయని తెలిపారు.